ధనుష్ ‘ఇడ్లి కడై’ vs భారీ పోటీ – అక్టోబర్ 1కి లాక్!

Share


ధనుష్ నటించి స్వీయ దర్శకత్వం వహిస్తున్న ఇడ్లి కడై (ఇడ్లి కొట్టు) సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యింది. ఏప్రిల్ లో థియేటర్లకు రావాల్సిన ఈ సినిమా ఇప్పుడు అక్టోబర్ 1న విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. జాబిలమ్మ నీకు అంత కోపమా రూపంలో ఫ్లాప్ ఎదురైనా, ఇడ్లి కడై కథపై ధనుష్ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. నిత్యా మీనన్ కథానాయికగా నటించగా, అరుణ్ విజయ్, షాలినీ పాండే, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

అయితే అక్టోబర్ 1 డేట్ ఎంచుకోవడం అంటే ధనుష్ మామూలుగా రిస్క్ తీసుకున్నాడని చెప్పాలి. అదే నెల 2న హోంబాలే ఫిలిమ్స్ భారీగా నిర్మిస్తున్న కాంతార: చాప్టర్ 1 రిలీజ్ కానుంది. ఇది ఒక్కటే కాదు, సెప్టెంబర్ 25న బాలకృష్ణ అఖండ 2 గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నాడు. బోయపాటి శ్రీను మాస్ హంగామాతో వచ్చే ఈ సినిమా భారీ హిట్ ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే రోజున సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటి గట్టు కూడా విడుదల కానుంది. ఇక ప్రభాస్ ది రాజా సాబ్ కూడా దసరా విడుదలకు వచ్చే అవకాశముంది.

ఈ పోటీని దృష్టిలో పెట్టుకున్నా, ధనుష్ తన ఇడ్లి కడై సినిమాను అదే డేట్ కు ఫిక్స్ చేయడం గట్టి నమ్మకంతో తీసుకున్న నిర్ణయంలా కనిపిస్తోంది. ఓ చిన్న ఇడ్లి కొట్టు నడిపే యువకుడి జీవితం ఆధారంగా ఈ కథను తెరకెక్కించారని సమాచారం. గత ఏడాది వచ్చిన రాయన్ సినిమాతో పోలిస్తే, ఇందులో మరింత మాస్ ఎలిమెంట్స్ ఉంటాయని చెబుతున్నారు. ఈ స్థాయి ప్యాన్ ఇండియా చిత్రాలతో తలపడతాడంటే ఇడ్లి కడైలో సాలిడ్ కంటెంట్ ఉన్నట్టే. మరి, ధనుష్ ఈ భారీ పోటీని ఎలా ఎదురుకుంటాడో చూడాలి!


Recent Random Post: