
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కథతో అనిల్ రావిపూడి మరోసారి సంక్రాంతి విజేతగా నిలిచారు. బ్లాక్‌బస్టర్ టాక్‌తో థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి కొనసాగుతోంది.
సినిమా ఘన విజయం సాధించిన నేపథ్యంలో చిత్రయూనిట్ స్పెషల్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలను ప్లాన్ చేసింది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడిని కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడగ్గా, వాటికి అనిల్ ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ సినిమాలో నయనతారను ఎలా ఒప్పించావు? అని చిరంజీవి అడిగిన ప్రశ్నకు అనిల్ ఇచ్చిన సమాధానం అందరి దృష్టిని ఆకర్షించింది. కథ రాసుకున్న దశ నుంచే చిరంజీవి స్థాయికి తగ్గ హీరోయిన్ కావాలని అనుకున్నానని, మెగాస్టార్ ముందు ధైర్యంగా నిలబడి మాట్లాడగలిగే క్యారెక్టర్ కావాలంటే వెంటనే నయనతారే గుర్తొచ్చిందని అనిల్ తెలిపారు. సాధారణ హీరోయిన్‌తో ఈ కథ వర్కౌట్ అవదని భావించి నయనతారను సంప్రదించినట్లు చెప్పారు.
ఈ విషయంలో నిర్మాతలు సాహు, సుస్మిత ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. నయనతారతో ఫోన్‌లో మాట్లాడి కథ చెప్పినప్పుడు ఆమెకు కథ చాలా నచ్చిందని, చిరంజీవి గారితో సినిమా చేయాలనే కోరిక ఎప్పట్నుంచో ఉందని, పైగా వెంకటేష్ గారు కూడా ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగిందని నయనతార చెప్పినట్లు అనిల్ వెల్లడించారు.
అయితే, కొన్ని టెక్నికల్ కారణాల వల్ల సినిమా చేయలేనేమో అన్న పరిస్థితి వచ్చిందని, ఆ సమయంలో నయనతార ‘నేను ఈ సినిమా చేయనని చెబితే నువ్వేం చేస్తావు?’ అని అడిగిందని తెలిపారు. దానికి తాను ఇచ్చిన హానెస్ట్ ఆన్సర్ వల్లే ఆమె ఫైనల్‌గా ఓకే చెప్పిందని అనిల్ అన్నారు. ‘వెంకటేష్ గారి దృశ్యం సినిమా లాగే, నేను కాల్ చేయలేదని, కథ చెప్పలేదని అనుకుని ప్రశాంతంగా పడుకుంటా’ అని చెప్పగానే నయనతార నవ్విందని, ఆ తర్వాతే ఆమె నిర్ణయం చెప్పిందని వివరించారు.
“నీ కోసం నేను ఈ సినిమా చేస్తున్నా. టెక్నికల్ ఇష్యూస్‌ను ఎలా అయినా క్లియర్ చేసుకో” అంటూ నయనతార గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అనిల్ తెలిపారు. కథ, క్యారెక్టర్ నచ్చడం వల్లే ఆమె ఈ సినిమాను వదులుకోలేదని, ప్రమోషన్స్ విషయంలో కూడా పూర్తి సహకారం అందించిందని పేర్కొన్నారు.
Recent Random Post:















