
ఎన్ని ఆఫర్లు వచ్చినా, ఎంత గ్యాప్ ఏర్పడినా, కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. 2019లో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హిట్ కొట్టాక, కేవలం జాతిరత్నాలు మరియు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మాత్రమే చేశాడు. ఈ రెండు చిత్రాలు మంచి విజయాలు సాధించినా, ఆరు ఏళ్లలో కేవలం మూడు సినిమాలతోనే టాలీవుడ్ స్క్రీన్‌పై కనిపించాడు. ఇటీవల అమెరికాలో జరిగిన ప్రమాదం వల్ల కొంత బ్రేక్ తీసుకున్నప్పటికీ, త్వరగా కోలుకొని అనగనగా ఒక రాజు షూటింగ్‌ను వేగంగా పూర్తి చేస్తున్నాడు.
ఇదిలా ఉండగా, ప్రముఖ దర్శకుడు మణిరత్నం నవీన్‌కు ఒక కథ చెప్పారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పొన్నియన్ సెల్వన్ మరియు తగ్ లైఫ్ వంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్స్ తర్వాత, మణిరత్నం ఇప్పుడు ఓ కూల్ రొమాంటిక్ లవ్ స్టోరీ చేయాలని భావిస్తున్నారట. సఖి, మౌనరాగం, ఓకే బంగారం తరహాలో తక్కువ బడ్జెట్లో సినిమాను ప్లాన్ చేశారు. మొదట కొత్త నటీనటులతో తీస్తారని భావించగా, తర్వాత స్టార్ క్యాస్టింగ్ వైపు మొగ్గుచూపారని సమాచారం. ఇందులో భాగంగా నవీన్ పోలిశెట్టిని సంప్రదించినట్లు టాక్.
అయితే, ఈ ప్రాజెక్ట్‌ను నవీన్ ఓకే చెబుతాడా అనే విషయంపై కొంత అనుమానం ఉంది. మణిరత్నం ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో లేరనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉంది. పొన్నియన్ సెల్వన్ తమిళనాడులో ఘన విజయం సాధించినా, ఇతర భాషల్లో అంతగా సక్సెస్ కాలేదు. అంతకుముందు ఆయన తెరకెక్కించిన సినిమాలు పెద్దగా ఆడలేదు. మణిరత్నం దర్శకత్వంలో టాలీవుడ్ హీరోలతో వచ్చిన ఏకైక హిట్ గీతాంజలి మాత్రమే, అది కూడా 37 ఏళ్ల క్రితం.
ఈ పరిస్థితుల్లో, తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న నవీన్ పోలిశెట్టి మణిరత్నంతో సినిమా చేయాలా? వద్దా? అనే విషయంలో ఆలోచనలో పడే అవకాశముంది. తగ్ లైఫ్ విడుదలైన తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై మరిన్ని క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.
Recent Random Post:















