టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ గతంలో జరిగిన ఇయర్ ఎండింగ్ రౌండ్ టేబుల్ డిస్కషన్ లో చేసిన కామెంట్స్ పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన అల్లు అర్జున్ పుష్ప-2 గురించి మాట్లాడుతూ, బాలీవుడ్‌లో కొన్ని ప్రముఖులకు ఆ సినిమా సింగిల్ డేలో రూ. 80 కోట్ల వసూళ్లు సాధించడంతో నిద్ర పట్టలేదని వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్‌పై బాలీవుడ్ దర్శకులు సిద్దార్థ్ ఆనంద్, సంజయ్ గుప్తా, హన్సల్ మెహతా లాంటి పలువురు మండిపడ్డారు. బీటౌన్ ఎగ్జిబిటర్ల సహాయంతోనే ఆ సినిమా వసూళ్లు సాధించిందని స్పష్టం చేస్తూ, తమకు ఎలాంటి నిద్రలేని రాత్రులు లేవని కౌంటర్ ఇచ్చారు.
ఈ వివాదం అప్పట్లో పెద్ద చర్చగా మారగా, తాజాగా మరోసారి నాగవంశీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు. నాగవంశీ నిర్మించిన బాలకృష్ణ మూవీ “డాకు మహారాజ్” ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై హిట్ టాక్ అందుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. అయితే, ఇటీవల హిందీ వెర్షన్ ను నార్త్ ఇండియాలో విడుదల చేశారు. సాధారణంగా మాస్ మూవీస్ పట్ల అంత ఆసక్తి కనబరచని ఉత్తరాది ప్రేక్షకులు ఈ సినిమాను ఆశక్తిగా వీక్షిస్తున్నారని రివ్యూస్ వచ్చాయి. బాలకృష్ణ నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్ లకు అభిమానులు ఫిదా అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే, డాకు మహారాజ్ హిందీ వెర్షన్ నాలుగు రోజుల్లో రూ. 20 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. దీంతో బాలీవుడ్ నెటిజన్లు నాగవంశీ గతంలో చేసిన “స్లీప్ లెస్ నైట్స్” కామెంట్‌ను ఎత్తి చూపుతూ ట్రోల్ చేస్తున్నారు. “ఇప్పుడు డాకు మహారాజ్ కలెక్షన్లు చూసి నిజంగానే నాగవంశీకి నిద్ర పట్టడం లేదేమో!” అంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.
ఈ ట్రోలింగ్ పై కొందరు టాలీవుడ్ ఫ్యాన్స్ నాగవంశీకి మద్దతుగా నిలుస్తూ, అనవసరంగా ఈ వివాదాన్ని తిరిగి లేపడం మంచి పరిణామం కాదని అభిప్రాయపడుతున్నారు. మరి, నాగవంశీ ఈ సోషల్ మీడియా ట్రోలింగ్ పై స్పందిస్తారో లేదో వేచి చూడాలి!
Recent Random Post: