నాగ చైతన్య ఫుడ్ బిజినెస్‌లో కొత్త అడుగు: ‘స్కుజి’ ప్రారంభం

Share


టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య సినిమాల పాటు వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నాడు. రెండు సంవత్సరాల క్రితం షోయూ పేరుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించిన చైతూ, దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఇప్పుడు మరింత విస్తరించి స్కుజి అనే కొత్త ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించాడు.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన చైతన్య, రెస్టారెంట్ కిచెన్‌తో పాటు అక్కడ తయారవుతున్న ఫుడ్ ఐటమ్స్‌కి సంబంధించిన ఫోటోలను షేర్ చేశాడు. అంతేకాకుండా, తన కొత్త బిజినెస్ ప్రయాణం గురించి భావోద్వేగపూరిత నోట్ రాశాడు.

“ఇప్పటికే ఉత్సాహంగా షోయూని ప్రారంభించాను. దానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన అపారమైన ప్రేమ, మాకు అద్భుతమైన కొత్త భాగస్వాములతో ముందుకు వెళ్లే ప్రేరణనిచ్చింది. మేము సంప్రదాయ వంటకాలను ఆధునిక రుచులతో మేళవించి మీ ముందుకు తెస్తున్నాం. మా మెనూతో వినూత్నమైన అనుభూతిని అందించేందుకు కట్టుబడి ఉన్నాం” అంటూ నాగ చైతన్య పేర్కొన్నాడు.

చైతూ ఈ కొత్త ప్రయాణానికి సినీ ప్రముఖులు, ఫ్యాన్స్, ఫుడ్ లవర్స్ అందరూ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు.

సినిమాల పరంగా చైతూ జోరు
ఇటీవల విడుదలైన తండేల్ సినిమాతో నాగ చైతన్య మంచి విజయాన్ని అందుకున్నాడు. శ్రీకాకుళం మత్స్యకారుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా భారీ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం, విరూపాక్ష ఫేమ్ కార్తీక్ దండ దర్శకత్వంలో ఓ మిస్టరీ హారర్ థ్రిల్లర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాను బీవీఎస్ ఎన్ ప్రసాద్ బ్యానర్, సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి. కథకు సుకుమార్ స్వయంగా స్క్రీన్‌ప్లే అందిస్తున్నట్లు సమాచారం.

సినిమాలు, బిజినెస్ రెండింటినీ సమర్థంగా కొనసాగిస్తున్న నాగ చైతన్య తాజా బిజినెస్ స్కుజి కూడా భారీ విజయాన్ని సాధిస్తుందేమో చూడాలి!


Recent Random Post: