నానికి అదే సమస్య?

నాచురల్ స్టార్ నాని ఎలా అయినా ఈసారి పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటాలని అనుకుంటున్నాడు. ఆయనే హీరోగా తెరకెక్కిన దసరా సినిమాతో ఈసారి కేవలం తెలుగు ప్రేక్షకులనే కాదు… తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుని పాన్ ఇండియా స్టార్ గా నిలదొక్కుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఆయన ముంబైలో ల్యాండ్ అయ్యి అక్కడ చేసిన ఈవెంట్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.

నాని బాంబే అభిమానులతో కలిసి హోలీ ఆడడమే కాదు… ఒక పాట స్క్రీనింగ్ కూడా అక్కడే చేసి వాళ్లను మరింత దగ్గర చేసుకునే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి నార్త్ బెల్ట్ లో నానికి పెద్దగా స్టార్ స్టేటస్ అయితే లేదు. ఆయన చేసిన డబ్బింగ్ సినిమాలను హిందీలో చూసిన ప్రేక్షకులు ఆయనను థియేటర్లలో ఎంతవరకు ఆదరిస్తారనేది తెలియాలి.

ఈ నేపథ్యంలోనే దసరా సినిమాని చాలా సీరియస్ గా తీసుకున్న ఆయన గట్టిగా అక్కడ సినిమాతో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాడు. తెలుగు తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉన్న ప్రాంతం హిందీ బెల్ట్ ఒక్కటే అయితే ఈ హిందీ బెల్ట్ లో బాగా వేయడానికి నానికి ఒక అడ్డంకి ఉంది.

అదే అజయ్ దేవగణ్ నటించిన భోళా సినిమా ఎందుకంటే దసరా విడుదలవుతున్న మార్చి 30వ తేదీన ఈ సినిమా కూడా రిలీజ్ అవుతోంది. పేరుకి కార్తీ సినిమాకి రీమేక్ అంటున్నారు కానీ ఈ సినిమాకి పెద్ద ఎత్తున మార్పులు చేశారు.

నార్త్ ఆడియన్స్ కి నచ్చే విధంగా మతపరమైన ఫ్లేవర్ ను సైతం గట్టిగానే పూసినట్లుగా ట్రైలర్ టీజర్ చూస్తే అర్థమవుతుంది. దృశ్యం కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవ్వడం భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా కనిపిస్తున్నట్లుగా ట్రైలర్ లో చూపివ్వడంతో భోళా సినిమా మీద నార్త్ బెల్ట్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు కూడా భోళా సినిమాకి మార్కులు ఎక్కువ వేస్తున్న నేపథ్యంలో దసరా లాంటి సినిమాకి ఎంతవరకు థియేటర్ సపోర్ట్ లభిస్తుంది అనేది చూడాలి.


Recent Random Post: