నాని భారీ నమ్మకంతో రాబోతున్న ‘కోర్ట్’

Share


నేచురల్ స్టార్ నాని నిర్మాతగా భారీ నమ్మకంతో తీసిన తాజా చిత్రం కోర్ట్ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో అ!, హిట్ 1, హిట్ 2 వంటి సినిమాలు ప్రొడ్యూసర్‌గా చేసినప్పటికీ, ఈసారి నానిలో కనబడుతున్న కాన్ఫిడెన్స్ వేరే స్థాయిలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాపై తన నమ్మకాన్ని ధృవీకరించేందుకు, రెండు రోజుల ముందుగానే ప్రీమియర్స్ నిర్వహించాలని నాని ప్లాన్ చేసుకున్నాడు. మీడియా, ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా మార్చి 12 నుంచే స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తున్నారని సమాచారం.

కోర్ట్ లో పెద్ద స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా, ప్రియదర్శి, సాయి కుమార్, హర్షవర్ధన్, రోహిణీ వంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే, ఈ తరహా కోర్ట్ రూమ్ డ్రామాలు కమర్షియల్ ఆడియన్స్ కు అంత సులభంగా రీచ్ కావు. కానీ నాని లెక్కలు వేరే ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాలో మాస్ ని మెప్పించే ఎлемెంట్స్ కూడా ఉన్నాయని నాని ధీమాగా చెబుతున్నాడు. “నచ్చకపోతే నా హిట్ 3 చూడొద్దు” అని ఇచ్చిన సవాల్ ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ అయింది.

మార్చి 14 రిలీజ్‌కు మంచి సమయం. పరీక్షల సీజన్ అయినా, బాక్సాఫీస్ వద్ద పెద్దగా పోటీ లేకపోవడం కోర్ట్ కు బలంగా మారవచ్చు. ఛావా మాత్రమే స్టడీగా కొనసాగుతుండగా, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ఫైనల్ రన్‌కు చేరుకుంటోంది. మజాకా చాప్టర్ ముగిసిపోయింది. పోటీగా కిరణ్ అబ్బవరం ‘దిల్ రుబా’ ఉన్నప్పటికీ, రెండూ విభిన్న జానర్ కావడంతో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు.

ఈ సినిమాకు నాని ప్రాముఖ్యత ఇస్తున్న విధానం చూస్తుంటే, ప్రీమియర్స్ ఫలితం కీలకంగా మారనుంది. పాజిటివ్ టాక్ వస్తే, సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది. ట్రైలర్ చూసినవారికి కనివిని ఎరుగని విషయం కనిపించకపోయినా, అసలు కంటెంట్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని నాని నమ్మకంగా చెబుతున్నాడు. ఇక ప్రమోషన్స్ విషయంలోనూ నాని స్వయంగా రంగంలోకి దిగాడు. టీమ్ మొత్తాన్ని ఒకే వేదికపై చేర్చి స్వయంగా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇంకా మరికొన్ని ఇంటర్వ్యూలు ప్లాన్‌లో ఉన్నాయి. త్వరలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా జరపాలని సన్నాహాలు చేస్తున్నారు.

ప్రీమియర్స్ నుంచే కోర్ట్ బాగుందని టాక్ వస్తే, సినిమా మంచి ఓపెనింగ్స్ దక్కించుకోవడం ఖాయం. ఇప్పుడు చూడాల్సిందల్లా, నాని తన కాన్ఫిడెన్స్ ను ఎలా వాడుకుంటాడన్నదే!


Recent Random Post: