పఠాన్ 2 పై ఆసక్తికర అప్‌డేట్ – భారీ ప్రిపరేషన్‌లో యశ్ రాజ్ ఫిలింస్!

Share


షారుక్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్, య‌శ్ రాజ్ ఫిలింస్ కాంబినేష‌న్‌లో విడుదలైన పఠాన్ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్ల‌ను రాబట్టి బాలీవుడ్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. య‌శ్ రాజ్ ఫిలింస్ నిర్మించిన అత్యంత భారీ యాక్షన్ థ్రిల్ల‌ర్‌గా పఠాన్ చరిత్ర సృష్టించింది. ఈ సినిమా విడుదలై రెండు సంవత్సరాలు పూర్తి కావస్తుండగా, దాని సీక్వెల్ అయిన పఠాన్ 2 పై ఆసక్తికరమైన వార్తలు బయటకొస్తున్నాయి.

ఇప్పటికే పఠాన్ 2 స్క్రిప్ట్ పనులు ప్రారంభమయ్యాయి. కథానాయ‌కుడు షారుక్ ఖాన్‌కు కూడా ఇటీవలే కథను నేరేట్ చేసినట్లు సమాచారం. ఈ సీక్వెల్ కథను ఆదిత్య చోప్రా, శ్రీధర్ రాఘవన్, అబ్బాస్ టైరేవాలా కలిసి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే, మొదటి భాగానికి దర్శకుడిగా వ్యవహరించిన సిద్ధార్థ్ ఆనంద్ సీక్వెల్‌కు మాత్రం దర్శకత్వం వహించబోరనే వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం పఠాన్ 2కు సంబంధించిన మొత్తం వ్యవహారాన్ని ఆదిత్య చోప్రా దగ్గరుండి చూసుకుంటున్నట్లు సమాచారం. మొదటి భాగానికి మించిన స్ట్రాంగ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. షారుక్ కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి దర్శకుడిగా ఎవరు వ్యవహరించబోతున్నారు అన్నదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఈ ఏడాది చివర్లో పఠాన్ 2 ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలై, 2026లో షూటింగ్ ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ సీక్వెల్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి!


Recent Random Post: