
పహల్గామ్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా ఆందోళన సృష్టించింది. ఉగ్రవాదులు అమాయకులైన పర్యాటకులపై జరిపిన దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తోంది. సామాన్యుల నుంచి అగ్ర దేశాలు వరకు అన్ని కోణాల్లో ఈ దాడి అనైతికమని అభిప్రాయపడ్డాయి. దేశం మొత్తం పహల్గామ్ పర్యాటక ప్రాంతానికి మద్దతుగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నా, అక్కడి పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. పహల్గామ్ లో పర్యాటకుల ఉపాధి ఆధారిత జీవనం సాగిస్తున్నారు, కానీ ఇప్పుడు ఉగ్రదాడి భయంతో అక్కడకు వెళ్లేందుకు పర్యాటకులు ముందుకు రావడం లేదు.
పహల్గామ్ గతంలో “స్విట్జర్లాండ్” గా ప్రసిద్ది చెందగా, ఇప్పుడు ఉగ్రవాదుల భయంతో అక్కడ పరిస్థితి మారిపోయింది. పర్యాటకులు, సినిమా షూటింగ్ లు, ఇలా అన్ని కోణాలలో భయాందోళన వాతావరణం నెలకొంది. కొన్ని నెలల క్రితం నాని హీరోగా నటించిన హిట్ 3 వంటి పెద్ద చిత్రాల షూటింగ్ పహల్గామ్‌లో జరిగింది. ఇంకా ఇతర తెలుగు చిత్రాలు కూడా అక్కడ షూటింగ్ నిర్వహించేందుకు ప్లాన్ చేసుకున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, నిర్మాతలు ప్రత్యామ్నాయ ప్రదేశాలు వెతకడం మొదలు పెట్టారు.
భవిష్యత్తులో, ఇక్కడ షూటింగ్ నిర్వహించడం భయాందోళన కరమైన విషయం అవుతుంది. పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన పరిణామం, పర్యాటకులు, చిత్ర పరిశ్రమకు నష్టాలను కలిగిస్తోంది. పలు ఇతర భాషల సినిమాలు కూడా ఈ ప్రాంతంలో షూటింగ్ నిర్వహించేవి. అలా ఉన్నా, మతం పేరుతో జరిగే హత్యలపై ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Recent Random Post:















