
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప 2 సంచలన విజయాన్ని సాధించింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ సీక్వెల్, విడుదలైన డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యేకించి, సంధ్యా థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం, ఓ చిన్నారి అపస్మార స్థితిలోకి వెళ్లడం వంటి ఘటనలు చర్చనీయాంశంగా నిలిచాయి. ఈ పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అవ్వడంతో పుష్ప 2 మరింతగా వార్తల్లో నిలిచింది.
అయితే ఈ వివాదాలన్నింటినీ అధిగమించి, బన్నీని మాస్ హీరోగా మరింత నిలబెట్టిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్ల భారీ వసూళ్లను రాబట్టి రికార్డులు సృష్టించింది. ఈ అపారమైన విజయంతో పుష్ప 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, పార్ట్ 3 కూడా ఊహించని స్థాయిలో రూపొందనుందని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
పార్ట్ 2లో పెళ్లి సందర్భంగా జరిగిన బాంబ్ పేలుడుతో కథను ముగించిన సుకుమార్, ఇప్పుడు పార్ట్ 3ని మరింత గంభీరంగా, గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో మునుపెన్నడూ చూడని మేజర్ ట్విస్టులు, అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్లు ఉండబోతున్నాయట.
ఇటీవల ఓ అవార్డ్ ఫంక్షన్‌లో పాల్గొన్న సుకుమార్, పుష్ప క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “మన దేశంలో ఎర్రచందనం స్మగ్లింగ్ విస్తృతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంపై ఓ వెబ్ సిరీస్ చేయాలనుకున్నా. అందుకోసం స్మగ్లర్లను కలిసి ఇంటర్వ్యూలు కూడా చేశాను. వారిలో ఒకరి పేరు పుష్పరాజ్. అతడిని అందరూ పుష్ప అని పిలిచేవారు. ఆ పేరునే మా హీరోకి పెడితే ఇండియా మొత్తం కనెక్ట్ అవుతుందనిపించింది” అని చెప్పారు.
అంతేగాక, పుష్ప 3లో ఇద్దరు క్రేజీ హీరోలు కనిపించే అవకాశముందని ప్రచారం జరుగుతుండగా, ఈ వార్తలపై స్పందించిన సుకుమార్ అవన్నీ ఊహాగానాలే అని తెలివిగా సమాధానమిచ్చారు. అయితే ఈ సమాధానం చూసి, ఏదో ఆసక్తికరమైన విషయం దాచిపెడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం పుష్ప 2 విజయాన్ని ఆస్వాదిస్తున్న సుకుమార్, పుష్ప 3ను మరో రెండేళ్ల తర్వాత మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో, ఈ మాస్ ఫ్రాంచైజీపై సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.
Recent Random Post:














