
ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన పుష్ప 2: ది రూల్ చివర్లో మూడో భాగం పుష్ప 3: ది ర్యాంపేజ్ కోసం హింట్ ఇచ్చినప్పటికీ, ఇది నిజంగా రాదా? వస్తే ఎప్పుడు? అనే అనుమానాలు అభిమానుల్లో నెలకొన్నాయి.
ప్రీ-రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, “అల్లు అర్జున్ మళ్లీ ఎక్కువ టైం డెడికేట్ చేయగలిగితే, నేను రెడీ” అనే సంకేతం ఇచ్చారు. అయితే, అన్‌స్టాపబుల్ షోలో బాలకృష్ణ అడిగిన ప్రశ్నకు బన్నీ మాత్రం “ఇక చాలు” అనేలా రియాక్షన్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో తాజాగా రాబిన్ హుడ్ ప్రమోషన్స్‌లో నిర్మాత రవిశంకర్, “పుష్ప 3 2028లో రాబోతుంది” అని చెప్పడం హాట్ టాపిక్‌గా మారింది.
ప్రాక్టికల్‌గా చూస్తే?
అల్లు అర్జున్ ఇంకా అట్లీతో తన పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయలేదు. వేసవిలో మొదలైనా, కనీసం ఏడాది ప్రొడక్షన్‌కు పడుతుంది. అంటే, అది 2026లో రానుంది. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ ఫాంటసీ మూవీ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. పెద్ద బడ్జెట్, భారీ విజువల్స్ ఉన్న ఈ సినిమాకు తక్కువలో తక్కువ 1.5–2 ఏళ్లు పట్టొచ్చు. అంటే 2027కి ముందుగా పూర్తయ్యేలా కనిపించదు.
అయితే, పుష్ప 3 కోసం బన్నీ కొత్త లుక్కు మారాల్సి ఉంటుంది. ఈ సినిమాలో గడ్డం, హెయిర్ స్టైల్ కీలకం. విగ్స్ వాడటం సాధ్యపడదు, ఎందుకంటే అల్లు అర్జున్ వాటిని ఎక్కువగా ఇష్టపడడు. అంటే పుష్ప 3 ముందే షూట్ చేసి ఉంచారా? అనే సందేహం రావడం సహజం.
వాస్తవానికి?
ఇన్సైడ్ టాక్ ప్రకారం, పుష్ప 3 కోసం ఇప్పటివరకు ఎలాంటి షూటింగ్ జరగలేదు. ఇక ముందు చేసేందుకు డేట్స్ లాగిస్తే, అట్లీ – త్రివిక్రమ్ సినిమాల మధ్య గ్యాప్ ఇచ్చి పుష్ప 3 కోసం ప్రత్యేకంగా టైం కేటాయించాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో 2028 విడుదల ఆచరణీయమేనా? అనే ప్రశ్న ఎదురవుతుంది.
నిజానికి పుష్ప 1, 2 కూడా అనేక వాయిదాల తర్వాతే వచ్చాయి. అలాంటప్పుడు వరుస ప్రాజెక్టుల మధ్యలో పుష్ప 3ని వేగంగా పూర్తిచేయడం అంత సులభం కాదు. రవిశంకర్ 2028 అని చెప్పిన మాట యథాలాపమే కావొచ్చు. కానీ నిజమైన క్లారిటీ రావాలంటే బన్నీ గానీ, సుకుమార్ గానీ ఓపెన్ అవ్వాల్సిందే. అయితే, దానికి కూడా ఇంకొంత టైం పడుతుందనడంలో సందేహం లేదు!
Recent Random Post:














