
పెద్ద హీరోల సినిమాలు వస్తే అందరి దృష్టి హీరోలపైనే ఉండడం సహజం. కానీ ఈసారి దళపతి విజయ్ సినిమాపై ఉన్న ఫోకస్ మొత్తాన్ని బుట్టబొమ్మ పూజా హెగ్డే తన వైపుకు తిప్పేసింది. కారణం — జననాయకన్ మూవీలోని మొదటి సింగిల్ “దళపతి కచేరి”.
ఈ పాటలో పూజా హెగ్డే చీరలో సాంప్రదాయంగా కనిపిస్తూ విజయ్ ఎనర్జీకి తగిన స్థాయిలో డ్యాన్స్ చేయడం, గ్రేస్‌ఫుల్ మూవ్స్‌తో ఆకట్టుకోవడం ద్వారా అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసింది. ఇప్పుడు ఈ పాట సక్సెస్‌కు పూజా ప్రధాన కారణమని అభిమానులు అంటున్నారు.
రజనీకాంత్ కూలీలోని “మోనికా” సాంగ్‌తో అలరించిన పూజా, దాదాపు రెండేళ్ల తర్వాత కోలీవుడ్‌కు జననాయకన్తో రీఎంట్రీ ఇస్తోంది. ఆమె చేసిన రెట్రో మూవీ ఫ్లాప్ అయినా, పూజా గ్లామర్, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం ఎప్పటిలాగే మెరిసిపోయాయి.
దళపతి కచేరి సాంగ్‌లో పూజా హెగ్డే లుక్స్, నడుము, నాభిపై ఎక్కువ ఫోకస్ చేశారంటూ కొందరు విమర్శించినా, ప్రేక్షకులు మాత్రం ఆమె అందాన్ని ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ పాట రిలీజైన గంటల్లోనే వైరల్ కావడంతో పూజా హెగ్డేకు ఇది నిజమైన కంబ్యాక్ అని అభిమానులు భావిస్తున్నారు. సౌత్ ఇండియన్ సినీ ప్రపంచంలో ఇప్పటికీ పూజా అత్యంత గ్లామరస్ హీరోయిన్లలో ఒకరని ఈ సాంగ్ మరోసారి నిరూపించింది.
Recent Random Post:














