
తమిళ స్టార్ హీరో సూర్య సరసన రెట్రో చిత్రంలో నటించిన పూజా హెగ్డే, కొంత విరామం తరువాత సౌత్ సినిమాల్లో తిరిగి ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రం మే 1న థియేటర్లలో విడుదల కానుంది. అనంతరం, దళపతి విజయ్ సరసన జననాయగన్ చిత్రంలో కూడా పూజా నటించనుంది. పూజా హెగ్డే ఈ క్రమంలో తన అభిమానులను విస్మరించకుండా, వారికి కావాల్సిన ట్రీట్స్ ఇస్తూ పండగ వాతావరణం తెచ్చింది. లేటెస్ట్ ఎల్లే కవర్ షూట్లో పూజా, రకరకాల డిజైనర్ దుస్తుల్లో నెట్లో దుమ్ము దులిపిస్తోంది.
ఈ కవర్ షూట్ కోసం పూజా గ్లామర్ ప్రదర్శిస్తూ, ట్రెడిషనల్ స్టైల్‌ను మిస్ కాకుండా, ఆమె అందాన్ని మరింత ప్రకాశితం చేసింది. రాజస్తానీ కళాకారులు లేదా జైపూర్ సాంప్రదాయ డిజైన్లు అయినా, పూజా టోన్డ్ లుక్, థై సొగసులను ఎలివేట్ చేస్తూ డిజైన్ చేసిన దుస్తుల్లో అద్భుతంగా ముస్తాబైంది. ముఖ్యంగా, బ్లాక్ కలర్ డిజైనర్ ఫ్రాక్ ఆమె లుక్కుని ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ ఫోటోషూట్ ఇప్పుడు నెట్లో వైరల్ అవుతోంది.
టాలీవుడ్లో అల వైకుంఠపురములో వంటి క్లాసిక్ హిట్లో నటించి, ఆ తర్వాత చరణ్ సరసన ఆచార్య సినిమాలో నటించిన పూజా, కొంతకాలం ఇండస్ట్రీ నుంచి దూరంగా ఉంటూ, మళ్లీ పెద్ద స్టార్లతో సినిమాలు చేయాలని అభిమానులు అనుకున్నప్పటికీ, అవకాశాలు తక్కువగా రావడంతో, పూజా రీఎంట్రీ ఎప్పుడు చేస్తుందో చూడాలి.
Recent Random Post:















