పూరీని గిల్లి మరీ ఆ రోల్ తీసుకున్న స్టార్ విలన్..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ సినిమా వస్తుంది అంటే ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ మాత్రమే కాదు పూరీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురుచూస్తుంటారు. సాధారణంగా డైరెక్టర్స్ కి చాలా తక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు అందులో పూరీ కూడా ఒకడు. ఆయనతో సినిమాలు తీసి కెరీర్ లో స్టార్ క్రేజ్ తెచుకున్న హీరోలు ఎంతోమంది ఉన్నారు. స్టార్స్ గా ఉన్న వారిని సూపర్ స్టార్స్ గ మార్చిన ఘనత పూరీదే. పవన్, మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా వీరి కెరీర్ లో పూరీతో చేసిన సినిమాల వల్ల డబుల్ క్రేజ్ సంపాదించారు.

మహేష్ తో పూరీ చేసిన పోకిరి, బిజినెస్ మెన్ రెండు సినిమాలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. మహేష్ స్టార్ డం ని ఆకాశానికి తాకేలా చేసిన సినిమా పోకిరి. ఆ సినిమా లో అన్ని అలా పర్ఫెక్ట్ గా కుదిరాయి. పూరీ మహేష్ కాంబోలో వచ్చిన పోకిరి ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. ఐతే ఈ సినిమాలో అలీ భాయ్ రోల్ కి ముందు వేరొక నటుడిని అనుకున్నాడట పూరీ. పోకిరి సినిమా లో ఆశిష్ విద్యార్థి చేసిన SI రోల్ ని ప్రకాశ్ రాజ్ కి అనుకున్నాడట. ఐతే ప్రకాశ్ రాజ్ ఆ పాత్ర చేయనని అన్నారట.

షాయాజి షిండే చేసిన పాత్ర అయినా చేస్తావా అని అంటే ఏమి మాట్లాడలేదట. అయితే ఈ సినిమాలో ఎవరో ఊరు నుంచి వస్తాడాన్నా అతనెవరు అని పాత్ర పేరు చెప్పమంటే పూరీ అలి భాయ్ అని అన్నాడట. అప్పుడు ఈ రోల్ తను చేస్తానని అన్నాడట. ఐతే పూరీ ఇది కేవలం వారం రోజుల పాత్ర అని అంటే క్లైమాక్స్ లో హీరో ఎవరితో ఫైట్ చేస్తాడని అడిగే సరికి పూరీ సైలెంట్ అయ్యాడట. అలా ముందు వేరే ఎవరినైనా పెడదాం అనుకున్న అలి భాయ్ రోల్ కి ప్రకాశ్ రాజ్ అలా కుదిరారు.

ఇక ముమైత్ ఖాన్ తో సాంగ్ చేస్తున్న టైం లో స్టూడియోలో అలి భాయ్ వేషంతో ప్రకాశ్ రాజ్ ఎంట్రీ ఇవ్వగా అప్పటికప్పుడు డైలాగ్స్ రాసి మళ్లీ రీషూట్ చేశారట. ఆ టైం లోనే గిల్లితో గిల్లించుకోవాలి అన్న డైలాగ్ రాశాడు పూరీ. అలా మొత్తానికి పూరీని గిల్లి మరీ పోకిరిలో అలీ భాయ్ రోల్ చేశాడన్నమాట. పూరీతో ప్రకాశ్ రాజ్ కాంబో కూడా ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందుకే వీరి కాంబో సంథింగ్ స్పెషల్ అని ఫిక్స్ అయ్యారు ఆడియన్స్.


Recent Random Post:

Dhee Jodi Latest Promo – 15th & 16th January 2025 9:30 PM – Vijay Binni, Hansika,Nandu

January 13, 2025

Dhee Jodi Latest Promo – 15th & 16th January 2025 9:30 PM – Vijay Binni, Hansika,Nandu