
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఆదాయం సంపాదించే సినీ తారల జాబితాలో బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ కొత్త రికార్డు సృష్టించాడు. హాలీవుడ్ దిగ్గజాలు ఆర్నాల్డ్ శ్వార్జెనెగ్గర్, డ్వేన్ జాన్సన్, టామ్ క్రూస్, జార్జ్ క్లూనీ, బ్రాడ్ పిట్, జాకీ చాన్ లాంటి స్టార్లను వెనక్కి నెట్టి షారూఖ్ ఖాన్ అత్యంత సంపన్న నటుడిగా నిలిచాడు. ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ నిర్మాణ సంస్థ, భారీ పారితోషికాలు, బ్రాండ్ ప్రమోషన్లు, వ్యాపార పెట్టుబడుల ద్వారా ఆయన రూ. 7400 కోట్లకు (దాదాపు $876.5 మిలియన్) పైగా సంపాదించాడని తాజా గ్లోబల్ సర్వే పేర్కొంది.
ఇతని బ్రాండ్ వ్యాల్యూ ఏడాదికిదాది పెరిగిపోతుండడం విశేషం. దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా షారూఖ్ కు ఉన్న క్రేజ్, మార్కెట్, వ్యాపారదారుల నుంచి వస్తున్న డిమాండ్ అన్నీ కలిపి ఆయనను ఈ స్థాయికి చేర్చాయి. వెండితెరపై మాత్రమే కాకుండా వ్యాపార రంగంలోనూ బాద్షా బ్రాండ్ స్థాయిని మరింత బలోపేతం చేస్తున్నాడు.
Recent Random Post:















