ప్రభాస్ సినిమాలు, ఒక భాగం చాలదా?

Share


చూడనిపిస్తున్న విధంగా, ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో రెండున్న‌ర గంట‌ల్లో సినిమా తీయ‌డం సాధ్యం కాకుండా పోతోంద‌నే అభిప్రాయం బ‌లపడుతోంది. రెండుచోట్ల చెప్పాల్సిన క‌థ‌ను ఒక్క‌సారి చెప్ప‌లేరా? రెండున్న‌ర గంట‌ల‌కు బ‌దులుగా మూడు గంట‌లు కేటాయించినా స‌రిపోదా? అన్న చ‌ర్చలు వినిపిస్తున్నాయి.

ప్ర‌భాస్ ‘బాహుబ‌లి’తో పాన్ ఇండియా మార్కెట్‌లో తన స్థానం ప‌క‌డ్బందీగా చేసుకున్నాడు. రాజులు, రాజ్యాల నేపథ్యంతో ఉన్న ఈ కథను రాజ‌మౌళి రెండు భాగాలుగా రిలీజ్ చేసి భారీ విజయాన్ని సాధించాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన ‘సాహో’, ‘రాధేశ్యామ్’, ‘ఆదిపురుష్’ చిత్రాలు అంచనాలను అందుకోలేకపోయాయి. లేదంటే వీటికి కొనసాగింపు కథలు కూడా వచ్చేవి.

ఇప్పుడున్న పరిస్థితిని పరిశీలిస్తే, ‘స‌లార్’, ‘క‌ల్కి’ సినిమాలు కూడా రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే వీటి మొదటి భాగాలు భారీ విజయం సాధించడంతో, మేకర్స్ రెండో భాగాల‌పై మరింత కసరత్తు చేస్తున్నారు. ఇవన్నీ పెద్ద స్థాయి కథలు కావడంతో, వాటిని రెండు భాగాలుగా తెర‌కెక్కించ‌డంలో అర్ధం ఉంది.

ఇదే ధోరణిలో ప్ర‌భాస్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న ‘పౌజీ’ కూడా రెండు భాగాలుగా రాబోతోంద‌నే ప్ర‌చారం ఉంది. 1800 ఏళ్ల నాటి ప్రేమ-యుద్ధ నేపథ్యంతో హ‌ను రాఘ‌వపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అలాగే, ప్ర‌భాస్ ‘రాజాసాబ్’ షూటింగ్‌లో కూడా పాల్గొంటున్నాడు. అయితే, ఈ సినిమా కూడా రెండు భాగాలుగా మారుతుంద‌నే టాక్ బ‌లపడుతోంది.

మొదట ఓ చిన్న సినిమాగా ప్లాన్ చేసిన ‘రాజాసాబ్’కు బడ్జెట్ భారీగా పెరగడంతో, మేకర్స్ దాన్ని రెండు భాగాలుగా విభజించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. కథను ఒక్క భాగంలో చెప్పే వీలున్నా, భారీ ఖర్చు పెట్టిన‌ప్పుడు రెండు భాగాలుగా విడదీసి విడుదల చేయాలనే వ్యూహాన్ని ఫాలో అవుతున్నారని సమాచారం.

ఇదిలా ఉంటే, ప్ర‌భాస్ సినిమాలు ఇప్పుడెవ‌రు కూడా రెండున్న‌ర గంట‌ల్లో ముగించేలా అనిపించ‌డం లేదు. డార్లింగ్ ఛరిష్మాతో పాన్ ఇండియా లెవెల్‌లో భారీ వసూళ్లు రాబట్టొచ్చ‌నే వ్యూహంతో మేకర్స్ ముందుకు సాగుతున్నారు. కానీ ఈ తరహా వ్యూహం అన్ని వేళలా విజయవంతం అవుతుందా? అనేది అనుమానమే!


Recent Random Post: