ప్రభాస్-హను రాఘవపూడి ప్రాజెక్ట్, ‘ఫౌజీ’ టైటిల్

Share


‘సీతారామం’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత, హను రాఘవపూడి డార్లింగ్ ప్రభాస్‌తో ఒక కొత్త ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. కథ రెండవ ప్రపంచ యుద్ధం నేప‌థ్యంలో ఉండబోతుందని సమాచారం. 1945 బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్వి ఇస్మాయిల్ నటిస్తున్నారు, ఇది ఆమె తొలి సినిమా.

వార్ బ్యాక్ డ్రాప్‌లో ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సినిమా గురించి కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో వినిపించాయి. హను రాఘవపూడి గతంలో నేచురల్ స్టార్ నాని కోసం రాసిన కథతోనే ప్రభాస్‌తో సినిమా చేస్తున్నారని ఒక టాక్ వెలువడింది. ఈ నేపథ్యంలో, హను రాఘవపూడి ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు. నాని కోసం రాసిన కథ, ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తున్న మూవీ ఒకటికాదు అని అన్నారు. ఆర్మీ బ్యాక్ డ్రాప్‌లో ఆరు కథలు రాసుకున్నానని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తున్న సినిమా కథ ‘సీతారామం’ తరువాత రాసుకున్నది అని, ఈ కథను కేవలం ప్రభాస్ కోసమే రూపొందించానని హను చెప్పారు. సినిమా స్టోరీని పూర్తిగా సిద్ధం చేసేందుకు ఒక సంవత్సరం సమయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సినిమా ప్రతి ఎలిమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ఆడియన్స్‌ను ఆస్వాదింపజేసే ఒక సరికొత్త ప్రపంచాన్ని ఈ సినిమా అందించబోతోంది అని అన్నారు.

ఈ సినిమాలో ‘ఫౌజీ’ అనే టైటిల్ పెట్టినట్లు కొన్ని ప్రచారాలు ఉన్నాయి, కానీ దీనిపై అధికారిక ప్రకటన లేదు. ప్రభాస్ ఈ చిత్రంలో బ్రిటిష్ ఇండియా ఆర్మీలో పనిచేసే సైనికుడిగా కనిపించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఇమాన్వి ఇస్మాయిల్‌కు ఇది తొలి సినిమా. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కొత్త ఫేస్ కోసం హను రాఘవపూడి ఆడిషన్స్ నిర్వహించి ఇమాన్విని ఎంపిక చేశారు.

ఇప్పటికే ఆమెపై కీలక సన్నివేశాలు చిత్రీకరించబడ్డాయి. త్వరలో ప్రభాస్ కూడా ఈ షూటింగ్‌లో పాల్గొననున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మిస్తోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, హను రాఘవపూడి మాత్రం సినిమా షూటింగ్ జరుగుతుండగా ఎలాంటి అప్డేట్స్‌ను బయట పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. రాజా సాబ్ సినిమా తర్వాత, అసలు అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది.


Recent Random Post: