ప్రియాంక చోప్రా గొప్ప వ్యక్తిత్వం

Share


ప్రియాంక చోప్రా ఒక గ్లోబల్ స్టార్. బాలీవుడ్‌లో కెరీర్ మొదలుపెట్టి, హాలీవుడ్‌ వరకు దూసుకెళ్లి తన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. సినీ నేపథ్యం లేకపోయినా అంచెలంచెలుగా పైకి ఎదిగి, ఈ స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా హాలీవుడ్‌లో పీసీ రేంజ్‌ విజయాన్ని సాధించడం సులభం కాదు. బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వెళ్లినవాళ్లు ఉన్నా, పీసీ అందుకున్న ఎత్తుకు ఎవరూ చేరలేకపోయారు.

ఈ ప్రయాణంలో భారతీయ సంస్కృతిని మరిచిపోయిందంటూ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నా, పీసీ వాటిపై ఎప్పుడూ స్పందించలేదు. తన పని తాను చేసుకుంటూ, విమర్శలకు దూరంగా ఉంటూ సైలెంట్‌గా ముందుకు సాగింది.

ఇక ప్రియాంక చోప్రా వ్యక్తిత్వం గురించి కొరియోగ్రాఫర్ విక్కీ భరత్యా ఇటీవల పంచుకున్న అనుభవం ఆసక్తికరంగా ఉంది. ప్రియాంక చోప్రా స్టార్ రేంజ్‌లో ఉన్నా, సెట్‌లో ఎంతో డౌన్ టు ఎర్త్‌గా ఉంటుందని, ఆమెను చూస్తే ఒక సాధారణ మహిళను చూసినట్టే అనిపిస్తుందట. సెట్‌లో ప్రతి ఒక్కరినీ గౌరవంగా చూసి, స్థాయికి సంబంధం లేకుండా అందరికీ సమానమైన ప్రేమను చూపిస్తుందట. స్థాయి కంటే మానవత్వానికే ఎక్కువ విలువ ఇస్తుందట. ఈ రోజుల్లో ఇంత వినమ్రతతో ఉండటం నిజంగా అరుదు. డబ్బు, స్థాయి ఉన్నవాళ్లు ఎలా ప్రవర్తిస్తారో చూస్తున్నాం కాబట్టి, పీసీ వైఖరి అందరికీ ఒక ప్రేరణ.


Recent Random Post: