
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా, ఆమె సోదరి పరిణీతి చోప్రా మధ్య విభేధాలు ఉన్నాయా? అనే ఊహాగానాలు బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారాయి. హిందీ మీడియా కథనాల ప్రకారం, ఇటీవల ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా వివాహ వేడుకలో ఈ అనుమానాలు మరింత బలపడినట్టు తెలుస్తోంది. రెడ్డిట్ వేదికగా జరిగిన చర్చల్లో, ప్రియాంక – పరిణీతి మునుపటి మాదిరిగా క్లోజ్‌గా లేరనే అభిప్రాయం వ్యక్తమైంది.
సిద్ధార్థ్ పెళ్లి వేడుకకు ఇద్దరూ హాజరయ్యారు కానీ, ప్రత్యేకంగా కలిసి ఎక్కడా కనబడలేదు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఫోటోల్లోనూ ఇద్దరు కలిసి దిగిన ఒక్క ఫోటో కూడా లేదు. దీంతో వీరి మధ్య విభేదాలున్నాయనే ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. మరోవైపు, పరిణీతి చోప్రా తన భర్త రాఘవ్ చడ్డాతో కలిసి వేడుకలో కనిపించినప్పటికీ, ఎక్కువ సేపు అక్కడ గడపలేదని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే చోప్రా కుటుంబంలో సోదరీమణుల మధ్య విభేదాలపై పుకార్లు వ్యాపిస్తున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన పరిణీతి వివాహానికి ప్రియాంక హాజరుకాకపోవడం కూడా ఈ వాదనలకు బలాన్నిచ్చింది. ఇక ముంబైలో జరిగిన సిద్ధార్థ్ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు పరిణీతి రాలేదనే అంశం కూడా వీరి మధ్య దూరం పెరిగిందనే అభిప్రాయానికి కారణమైంది. అయితే, పెళ్లి రోజు పరిణీతి మాత్రం తల్లి రీనా చోప్రాతో కలిసి వచ్చి, వేడుకలో పాల్గొంది.
పెళ్లి అనంతరం రీనా చోప్రా సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ఫోటోలను షేర్ చేశారు. అయితే అందులో ఎక్కడా ప్రియాంక, పరిణీతి కలిసి లేరు. ఇది మరింత అనుమానాలకు తావిచ్చింది. కొంతమంది నెటిజన్లు, “అక్కా చెల్లెళ్లు కలిసి దిగిన ఒక్క ఫోటో కూడా లేకపోవడం ఏంటి?” అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు ప్రియాంక, మోదీ ప్రభుత్వంతో సాన్నిహిత్యం పెంచుకునేందుకు పరిణీతి-రాఘవ్ జంటను దూరం పెడుతున్నారా? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే, ప్రియాంక మాత్రం తన సోదరుడి పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ, “జీవితాంతం ప్రేమ, ఆనందంతో నిండి ఇలానే కొనసాగాలి #SidNiKiShaadi” అని క్యాప్షన్ ఇచ్చింది. పెళ్లిలో ప్రియాంక చోప్రా తన తమ్ముడిని మండపానికి తీసుకెళ్లే వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా, వధువు నీలం ఉపాధ్యాయతో ప్రత్యేకంగా టైమ్ స్పెండ్ చేసిన వీడియోలు కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఒకవైపు ఈ ఊహాగానాలు చర్చనీయాంశంగా మారుతున్నా, ప్రియాంక – పరిణీతి మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Recent Random Post:















