ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న నిధి అగర్వాల్ స్పెషల్ స్ట్రాటజీ

Share


ఈ మధ్య హీరోయిన్లు కూడా ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా శ్రమిస్తున్నారు. మాతృభాష కాకపోయినా, వేరే రాష్ట్రాల నుంచి వచ్చినప్పటికీ తెలుగు నేర్చుకుని, ఇక్కడి సంస్కృతికి తగ్గట్టు వ్యవహరిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అభిమానులు తమ హీరోలు, హీరోయిన్ల గురించి చేసే కామెంట్స్, ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్స్, ఎక్కువగా వినిపించే స్లోగన్స్ ఏమిటో గమనించి, వాటిని తమ మాటల్లో ఉపయోగిస్తూ ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న నిధి అగర్వాల్ కూడా అదే బాటలో ముందుకెళ్తున్నారు. తన కట్టుబాటు, మాటలతో స్టార్ హీరోల అభిమానులను బాగా ఆకట్టుకున్నారు నిధి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేసిన హరి హర వీరమల్లు సినిమా ఎంత ఆలస్యమైనా సరే, నిర్మాతలకు ఇచ్చిన కమిట్‌మెంట్ కోసం ఆ ప్రాజెక్ట్‌కు కట్టుబడి ఉండటం ద్వారా పవన్ ఫ్యాన్స్ మనసులు గెలుచుకున్నారు. సినిమా లేటవుతుందని ప్రాజెక్ట్ నుంచి తప్పుకోకుండా వేచిచూడటం ఆమె ప్రొఫెషనలిజాన్ని చూపించింది.

ఇక సినిమా రిలీజ్ సమయంలో పవన్ ఎక్కువగా ప్రమోషన్స్‌కు టైమ్ కేటాయించలేకపోయినా, ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకుని నిధి స్వయంగా ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా మెచ్చుకోవడంతో, ఆయన అభిమానుల నుంచి నిధికి మరింత సపోర్ట్ లభించింది.

ఇక సినిమా రిలీజ్ సమయంలో పవన్ ఎక్కువగా ప్రమోషన్స్‌కు టైమ్ కేటాయించలేకపోయినా, ఆ బాధ్యతను తన భుజాలపై వేసుకుని నిధి స్వయంగా ప్రమోషన్స్ నిర్వహించారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా మెచ్చుకోవడంతో, ఆయన అభిమానుల నుంచి నిధికి మరింత సపోర్ట్ లభించింది.

వీరమల్లు సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా, ఆ సినిమా చేసినందుకు బాధపడినట్టు నిధి ఎక్కడా చెప్పలేదు. దానికి బదులు, ఆ మూవీ వల్ల తనకు మంచి పేరు వచ్చిందని, తన నటనకు ప్రశంసలు దక్కాయని చెప్పి అందరి మనసులు గెలుచుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో చేసిన రాజా సాబ్ కోసం కూడా అదే అంకితభావంతో పనిచేస్తున్నారు.

రాజా సాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ సమయంలో ఫ్యాన్స్ వల్ల కొంత ఇబ్బంది ఎదురైనా, దానిని లైట్ తీసుకుని ఏమీ అనకుండా వ్యవహరించడం ద్వారా ప్రభాస్ అభిమానులను కూడా ఫిదా చేశారు నిధి. తాజాగా రాజా సాబ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

తాను పని చేసిన హీరోల గురించి ఫ్యాన్స్ ఏమనుకుంటారనే అంశంపై మాట్లాడుతూ, పవన్ ఫ్యాన్స్ “బాబులకే బాబు కళ్యాణ్ బాబు” అని, ప్రభాస్ ఫ్యాన్స్ “రాజులకే రాజు ప్రభాస్ రాజు” అని నినదిస్తారని చెప్పింది. అంతేకాదు, తన గురించి “పాపలకే పాప నిధి పాప” అని ఫ్యాన్స్ అంటారని ఫన్నీగా ఇమిటేట్ చేసి నవ్వులు పూయించింది. ఇవన్నీ మీకెలా తెలుసు అని అడిగితే, సినిమా ఈవెంట్స్‌లో ఫ్యాన్స్ ఇదే జోష్‌తో స్లోగన్స్ వేస్తుంటారని, వాటిని గమనించడం వల్లే తెలుసని చెప్పి పవన్, ప్రభాస్ అభిమానులను మరింత ఆకట్టుకుంది నిధి.


Recent Random Post: