ఫ్యాన్స్ వ‌ల్ల అరుదైన వ్యాధికి గురైన సిద్ధార్థ్!

Share


హీరో సిద్ధార్థ్ ఎప్పుడూ ఏదో వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటాడు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి నటుడు మంచి క్రేజ్, ఫాలోయింగ్, గుర్తింపు కోసం కృషి చేస్తారు. కొంతమందికి తక్కువ కాలంలోనే పెద్ద ఫేమ్ వస్తే, మరికొంతమందికి ఎంత ప్రయత్నించినా అది అందని ద్రాక్షలాగే మిగిలిపోతుంది.

క్రేజ్ వచ్చిన తర్వాత దాన్ని ఎంజాయ్ చేయడం సహజం. కానీ సిద్ధార్థ్ మాత్రం తన స్టార్‌డమ్ వల్ల “పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్” (PTSD) సమస్యను ఎదుర్కొన్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ మానసిక సమస్య నుంచి బయటపడేందుకు తనకు ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాల సమయం పట్టిందని వెల్లడించాడు.

స్టార్‌డమ్ సాధించేందుకు ఎంతో శ్రమించానని, అయితే ప్రేక్షకులు తనతో మాట్లాడటానికి వచ్చేప్పుడు తాను తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవాడినని, అందువల్ల తన ఫేమ్‌ను అస్సలు ఎంజాయ్ చేయలేకపోయానని చెప్పాడు. చాలా మంది స్టార్ స్టేటస్‌ను అందుకున్న తర్వాత ధన్యతాభావంతో ఉండాలని భావిస్తారని, కానీ తన పరిస్థితి భిన్నంగా ఉండేదని పేర్కొన్నాడు. జనాల అటెన్షన్ తనకు అలవాటవ్వడం చాలా సమయం తీసుకుందని చెప్పాడు.

అయితే తన భార్య అదితి రావు హైదరీ మాత్రం పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వం కలిగినవారని సిద్ధార్థ్ తెలిపారు. అదితి స్పాట్‌లైట్‌లో ఉండటాన్ని బాగా ఎంజాయ్ చేస్తుందనీ, ప్రజల దృష్టిలో ఉండటం ఆమెకు ఎంతో ఆనందాన్నిస్తుందని చెప్పారు. దీనిపై అదితి మాట్లాడుతూ, “సిద్ధూ అటెన్షన్‌ను అస్సలు ఇష్టపడడు. కానీ నాకు మాత్రం అది చాలా ఇష్టం. మనను ఎవరో ప్రేమించడం ఒక అదృష్టం. దాన్ని ఆస్వాదించలేకపోవడం బాధకరం” అని అన్నారు.


Recent Random Post: