
ఒక కమర్షియల్ హిట్ కోసం చాలామంది హీరోలు అట్లీ లాంటి మాస్ డైరెక్టర్ కోసం ఎదురుచూస్తుంటారు. అతను తెరకెక్కించిన సినిమాలు మాస్ ప్రేక్షకులను థియేటర్లలో ఊగేసేలా చేస్తాయి. అయితే, బన్నీ మాత్రం అదే ఫార్ములా ఫాలో అవడం లేదు. అట్లీతో కలిసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌లో ఒక ప్రత్యేకమైన సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు.
పుష్ప 2 తో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం భారీ ప్రిపరేషన్లో ఉన్నాడు. ఇప్పటికే పుష్ప 2 వరల్డ్‌వైడ్‌గా ₹1800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా మార్కెట్‌కి కొత్త దిశ చూపింది. ఆ విజయాన్ని మించిన స్థాయిలో, తన తదుపరి సినిమా అట్లీతో కలిసి ఒక స్పెషల్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌గా రూపొందించబోతున్నాడు.
ఈ సినిమా రెగ్యులర్ మాస్ ఎంటర్టైనర్ కాదు. హాలీవుడ్ టెక్నీషియన్స్, వీఎఫ్ఎక్స్ స్టూడియోలు, ఆర్ట్ డైరెక్టర్లు — వీటన్నింటిని కలిసి ఒక అంతర్జాతీయ స్థాయిలో సినిమా తీసే ప్రయత్నం చేస్తున్నారు బన్నీ, అట్లీ. ట్రాన్స్ఫార్మర్స్, అవెంజర్స్, ఆక్వామాన్ వంటి హాలీవుడ్ సినిమాల్లో పనిచేసిన టెక్నికల్ టీమ్‌లు ఈ సినిమాకు పని చేయబోతున్నారు.
సన్ పిక్చర్స్ ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయించింది. ప్రీ-ప్రొడక్షన్ దశ నుంచే సినిమా లాస్ ఏంజిల్స్‌లో ప్లాన్ అవుతుండటం, విజువల్స్, కథానాయకుడి లుక్, కథా థీమ్స్ అన్నీ డిఫరెంట్‌గా ఉండబోతున్నాయన్న సంగతి స్పష్టమవుతోంది.
‘AA22’ అనే వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ అభివృద్ధిలో ఉంది. త్వరలో ఫస్ట్ లుక్, టైటిల్, మ్యూజిక్ టీమ్ వివరాలు అధికారికంగా విడుదల కానున్నాయి. బన్నీ ప్రస్తుతం ఉన్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టేటస్, పాన్ ఇండియా క్రేజ్ నేపథ్యంలో ఈ స్థాయిలో రిస్క్ తీసుకోవడం నిజంగా దృఢమైన నిర్ణయం.
ఇది ఒక సాధారణ కమర్షియల్ సినిమా కాదని, తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ స్టాండర్డ్‌కు తీసుకెళ్లే ప్రయత్నమని ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ స్పష్టంగా చెబుతున్నాయి. బన్నీ, అట్లీ కాంబినేషన్ పై ఇండస్ట్రీలో విపరీతమైన ఆసక్తి నెలకొంది.
Recent Random Post:














