బన్నీ నాలుగు పాత్రల్లో సంచలనం!

Share


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, మాస్ కమర్షియల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా చిత్రం రూపొందుతోంది. బన్నీ ఈ సినిమాలో నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందులో రెండు పాత్రలు తండ్రీకొడుకులుగా ఉండగా, మిగిలిన రెండింటికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ నాలుగు పాత్రల కథను అట్లీ ఎంతో ప్రత్యేకంగా డిజైన్ చేశాడట.

తాజా సమాచారం ప్రకారం… ఈ నాలుగు పాత్రల మధ్య చోటు చేసుకునే క్లాష్, కథానాయకుడి లుక్స్, నటన – అన్నీ నాగ్‌పూర్ డైమండ్ క్రాసింగ్ లైన్ కాన్సెప్ట్ ఆధారంగా మలచబడ్డాయట. ఈ లైన్ భారతదేశంలో ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర రైల్వే మార్గాలు కలిసే ఏకైక ప్రదేశం. సినిమాలో కూడా ఈ నాలుగు పాత్రలు ఓ కీలక ఘట్టంలో ఒకే చోట కలిసి భారీ మలుపు తిప్పనున్నాయని తెలుస్తోంది.

ఇంటర్వెల్ బ్లాక్‌కి ముందు ఓ బలమైన క్లాష్, చివర్లో క్లైమాక్స్‌లో మరొకసారి నాలుగు పాత్రల కలయిక కీలకం కానుంది. ఈ టైమ్ కండెక్షన్, కథన ప్రణాళిక టెక్నికల్‌గా సినిమాకి హైలైట్ కానుంది. కథ పూర్తి స్థాయిలో భారతదేశంలో జరిగే స్టోరీతో ఉంటుంది.

ఇదే బన్నీ తొలి మూవీ కావడం విశేషం, ఇందులో తొలిసారి నాలుగు పాత్రలతో తెరపై మెరవనున్నారు. ప్రస్తుతం ముంబైలో వేసిన భారీ సెట్స్‌లో షూటింగ్ జరుగుతోంది. మేజర్ పార్ట్ మొత్తం అక్కడే ప్లాన్ చేసినట్లు సమాచారం. తరువాతి షెడ్యూల్స్ హైద‌రాబాద్, చెన్నైలో జరగనున్నాయి.

ఈ చిత్రంలో లేడీ లీడ్‌గా దీపికా పదుకొణే ఫైనలైజ్ అయింది. మరో ముగ్గురు నాయికల ఎంపిక ప్రక్రియలో ఉన్నారు. అట్లీ మార్క్ మాస్‌కి బన్నీ స్టైల్ పెర్ఫార్మెన్స్ జతకలిస్తే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.


Recent Random Post: