బాలీవుడ్‌లో జాట్ దుమారం: గోపీచంద్ మలినేని మాస్ మేజిక్!

Share


బాలయ్యతో ‘వీర సింహా రెడ్డి’, రవితేజతో ‘క్రాక్’ వంటి మాస్ బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని, ఇప్పుడు బాలీవుడ్‌ను టార్గెట్ చేశారు. సన్నీ డియోల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘జాట్’, ఏప్రిల్ 11న గ్రాండ్‌గా విడుదలై నార్త్ బెల్ట్‌లో మంచి రెస్పాన్స్‌ను అందుకుంటోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై పెద్దగా హైప్ లేకపోయినా… పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో మాత్రం భారీ క్రేజ్ నెలకొంది. మొదటి రోజున మోస్తరు ఓపెనింగ్స్ నమోదు చేసిన జాట్, రెండో రోజు నుంచే జోరు పెంచింది. సన్నీ డియోల్ ఫాలోయింగ్ ఉన్న ప్రాంతాల్లో థియేటర్ల వద్ద జనాలు క్యూ కట్టడం గమనించవచ్చు.

ఫ్యాన్స్, మాస్ ఆడియన్స్ ఈ సినిమాలోని ఎలివేషన్లపై హంగామా చేస్తున్నట్టు ట్రేడ్ టాక్. లాంగ్ వీకెండ్, ఆదివారం ఎఫెక్ట్‌తో కలిపి వీకెండ్ బాక్సాఫీస్ వసూళ్లు రూ.30 కోట్లు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సోమవారం సెలవు కావడంతో నాలుగు రోజుల రన్ సినిమాకి మరింత బెనిఫిట్ ఇవ్వొచ్చు.

గోపీచంద్ మలినేని తన సిగ్నేచర్ మాస్ టచ్‌ను బాలీవుడ్ స్టైల్‌లో అద్దంగా చూపించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందించబడింది. సన్నీ డియోల్, గోపీచంద్ కాంబినేషన్ మాస్ ఆడియన్స్‌కు పక్కా హిట్ ఫార్ములా అయ్యింది.

ఈ సినిమాలో రేజీనా కసాంద్రా కీలక పాత్రలో మెప్పించగా, సయ్యామి ఖేర్ స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించింది. మ్యూజిక్, బీజీఎమ్ సినిమా మూడ్‌ను perfectly క్యాచ్ చేసాయి. యాక్షన్ సీన్స్, పవర్‌ఫుల్ డైలాగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలసి బాలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయనే వాదన వినిపిస్తోంది.

దక్షిణ దర్శకులకు బాలీవుడ్ ఎంట్రీ ఓ పెద్ద టెస్ట్ లాగా ఉంటుంది. కానీ ‘జాట్’తో గోపీచంద్ మలినేని మాస్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసినట్టే కనిపిస్తున్నారు. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి!


Recent Random Post: