
బాక్సాఫీస్ క్వీన్ సాయి పల్లవి ‘రామాయణం’ సినిమాతో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతోన్న విషయం తెలిసిందే. అదీ కూడా ఏకంగా సీత పాత్రలో కనిపించబోతోంది. కెరీర్లో ఇదో బెస్ట్ లాంచ్ అవుతుందనే భావన ఉంది. ఈ సినిమా సూపర్ హిట్ అయితే, సీత పాత్రకు వచ్చే గుర్తింపు బాలీవుడ్ చరిత్రలో నిలిచిపోతుంది.
సాయి పల్లవి టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతోమంది స్టార్ హీరోయిన్లను పక్కనపెట్టి నితీష్ తివారీ ఆమెను ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం. సాధారణంగా సాయి పల్లవిని ఏదైనా ప్రాజెక్ట్‌కు ఒప్పించడం అంత సులభం కాదు. కానీ, ఈ సీత పాత్ర విషయంలో నితీష్ తివారీ ఆమెను సులభంగా ఒప్పించగలిగాడు.
ఇప్పటికే బాలీవుడ్లో సాయి పల్లవికి మరో క్రేజీ ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. టాప్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్, ఆమెను ధర్మ ప్రొడక్షన్స్‌లో రెండో సినిమాకి సైన్ చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సినిమాపై పూర్తి క్లారిటీ లేకపోయినా, ముందుగా ఒప్పందం చేసుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయట.
అయితే, ఇది అంత ఈజీ కాదు. సాయి పల్లవిని ఒప్పించడం అనేది చాలా మందికి చేతకాని పని. గ్లామర్ రోల్స్, రొమాంటిక్ సీన్స్‌కి ఆమె దూరంగా ఉంటుంది. ఎంత భారీ రెమ్యూనరేషన్ ఇచ్చినా, ఆమె తన నియమాలకు కట్టుబడి ఉంటుంది. ధర్మ ప్రొడక్షన్స్ బాలీవుడ్లో బిగ్ బanner అయినప్పటికీ, కరణ్ జోహార్ మీద రొమాంటిక్ చిత్రాల ప్రొడ్యూసర్ అనే ట్యాగ్ ఉంది. ఇది సాయి పల్లవిని వెనక్కి తగ్గించే అవకాశం లేకపోలేదు.
మొత్తానికి, ‘రామాయణం’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సాయి పల్లవి, అక్కడ కొనసాగుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.
Recent Random Post:














