
బాక్సాఫీస్ వద్ద ఒక ఫార్ములా మూవీ బ్లాక్‌బస్టర్ హిట్టయి రికార్డులు సృష్టిస్తే, ఆ కాన్సెప్ట్‌తో సినిమాలు చేసేందుకు అందరూ సిద్ధమవుతారు. తాజాగా అదే జరుగుతోంది. ఈ విషయంలో దర్శకులు విజయ్ ఆంటోనీ హిట్ కాన్సెప్ట్‌ను కాపీ కొడుతున్నారని ప్రేక్షకులు అంటున్నారు.
సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ, 2012లో నాన్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. కానీ నిజమైన గుర్తింపు మాత్రం 2016లో వచ్చిన బిచ్చగాడు సినిమాతోనే దక్కింది. తల్లి కోసం బిచ్చగాడిగా మారే కోటీశ్వరుడి కథ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వటంతో విజయ్ ఆంటోనీకి స్టార్ ఇమేజ్ వచ్చింది.
ఏడేళ్ల విరామం తర్వాత విజయ్ ఆంటోనీ తెరకెక్కించిన బిచ్చగాడు 2 కూడా హిట్టయింది. దీనితో బిచ్చగాడు 3 కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో విజయ్ ఆంటోనీ మొదలు పెట్టిన ఈ కాన్సెప్ట్‌ని ఇతర దర్శకులు సొంతం చేసేస్తున్నారు.
తాజాగా ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర సినిమాకు ప్రేక్షకులు మంచి స్పందన ఇస్తున్నారు. మొదటి రోజు రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించి దూసుకెళ్తోంది. ఇందులో ధనుష్ బిచ్చగాడి పాత్రలో నటించడం విశేషం. దీని తర్వాత పూరి జగన్నాథ్ కూడా అదే కాన్సెప్ట్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో కనిపించనుండగా, టాబు, సంయుక్త మీనన్ వంటి స్టార్లు కూడా నటించనున్నారు.
ఇకపోతే, విజయ్ ఆంటోనీ అభిమానులు మాత్రం ఈ పరిణామంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బిచ్చగాడు కాన్సెప్ట్‌ను మొదట పరిచయం చేసిన విజయ్ ఆంటోనీకి దీనితో నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఐదు సినిమాలతో బిజీగా ఉన్న విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 3ను మరో రెండేళ్ల తరువాతే మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతవరకు పూరి, శేఖర్ కమ్ముల సినిమాలు బిచ్చగాడి కాన్సెప్ట్‌తో ఏ స్థాయిలో సక్సెస్ అవుతాయో చూడాలి.
Recent Random Post:















