
మిస్టర్ బచ్చన్ చిత్రంతో టాలీవుడ్లో అడుగుపెట్టిన భాగ్య శ్రీ బోర్స్, తన గ్లామర్ షోతో మొదటి సినిమాతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. సినిమా కమర్షియల్‌గా విజయవంతం కాకపోయినప్పటికీ, భాగ్య శ్రీపై పరిశ్రమలో ఆసక్తి పెరిగింది. ఆమె ప్రమోషన్లకు చూపిన కమిట్మెంట్, మీడియా ముందుగానూ తన చురుకైన వ్యవహారంతో మరిన్ని అవకాశాలకు దారితీసింది.
ప్రస్తుతం భాగ్య శ్రీ బోర్స్ విజయ్ దేవరకొండతో నటిస్తున్న కింగ్ డమ్ సినిమాతో ఈ నెల 31న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంతో పాటు, రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ఆంధ్రా కింగ్ అనే మరో చిత్రంలో భాగ్య శ్రీ జంటగా కనిపించనుంది. ఈ రెండు ప్రాజెక్టులపై కూడా ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది.
ఇవి కాకుండా, సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కిస్తున్న ద్విభాషా పీరియాడికల్ చిత్రం కాంతాలో భాగ్య శ్రీ లీడ్ రోల్ పోషిస్తోంది. దుల్కర్ సల్మాన్, రానా దగ్గుబాటి వంటి స్టార్ కాస్ట్ ఉన్న ఈ సినిమాలో భాగ్య శ్రీ పాత్ర కీలకమని టీజర్లను చూస్తేనే అర్థమవుతుంది. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్‌తోనే ఇది ఆమె కెరీర్లో మైలురాయిగా నిలవబోతుందన్న అభిప్రాయం ఫిలిం సర్కిల్స్‌లో గట్టిగా వినిపిస్తోంది.
ఇక విడుదల తేదీల విషయానికొస్తే, కింగ్ డమ్ జూలై 31న వస్తుండగా, ఆంధ్రా కింగ్ రెండు నెలలలోపు విడుదలయ్యే అవకాశం ఉంది. కాంతా కూడా ఈ ఏడాది చివర్లో విడుదల కావచ్చని సమాచారం. అంటే, ఒకే సంవత్సరంలో భాగ్య శ్రీకి మూడు భారీ సినిమాలు రిలీజ్ కావడం తన స్థాయిని ఏమాత్రం తక్కువ చేయదు.
ఈ మూడు సినిమాల ద్వారానే కాదు, తన గ్లామర్‌తో పాటు నటనా ప్రతిభను కూడానూ నిరూపించగలిగితే, భాగ్య శ్రీ బోర్స్ టాలీవుడ్లో కొత్త స్టార్ హీరోయిన్గా నిలిచే అవకాశం బలంగా కనిపిస్తోంది. అప్పుడు ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్స్‌కి గట్టి పోటీగా మారటం ఖాయమని చెప్పొచ్చు.
Recent Random Post:














