
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సినిమా ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమా క్యాస్టింగ్ కోసం చిత్ర యూనిట్ క్యాస్టింగ్ కాల్‌ను ప్రకటించింది. వయసుతో సంబంధం లేకుండా, పురుషులు స్త్రీలు అందరికి ఈ అవకాశం ఇవ్వాలని భద్రకాళి పిక్చర్స్ సోషల్ మీడియాలో తెలియజేసింది.
ఇంట్రెస్ట్ ఉన్నవారు, తమ రెండు నిమిషాల వీడియోతో పాటు ఫోటోలను మెయిల్ చేయాలని నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ ప్రకటనపై, మంచు విష్ణు స్పందిస్తూ స్పిరిట్ సినిమా క్యాస్టింగ్ కాల్‌కు తాను కూడా అప్లై చేసుకున్నట్లు ట్వీట్ చేశాడు. “వెయిట్ చేసి చూద్దాం, ఏమవుతుందో!” అని పేర్కొన్న విష్ణు, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాడు.
మరికొంతమంది నెటిజన్లు విష్ణుకి ఈ విషయంలో ఆల్ ది బెస్ట్ చెప్తుంటే, కొందరు మాత్రం “నీ అప్లికేషన్ తప్పకుండా రిజెక్ట్ అవుతుంది” అంటూ విష్ణును ట్రోల్ చేస్తున్నారు. అయితే, విష్ణు మరియు ప్రభాస్‌కు మంచి అనుబంధం ఉంది. విష్ణు తండ్రి మోహన్ బాబు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు ఎంతో సన్నిహిత సంబంధం ఉంది. బుజ్జిగాడు చిత్రంలో మోహన్ బాబు ప్రభాస్‌తో కలిసి కీలక పాత్రలో నటించారు.
ఇప్పుడు, మోహన్ బాబు నిర్మిస్తున్న కన్నప్ప సినిమాలో ప్రభాస్ గెస్ట్ రోల్లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ప్రభాస్ రుద్ర అనే పాత్రలో కనిపించనున్నాడు. విశేషంగా, ఈ సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేదని విష్ణు స్వయంగా వెల్లడించాడు. కన్నప్ప సినిమాతో ప్రభాస్‌కు సంబంధించిన ఈ అనుబంధం, నెటిజన్లలో స్పిరిట్ సినిమాలో విష్ణుకు కూడా ఏదైనా పాత్ర వస్తుందని అంచనాలు పెంచుతుంది.
Recent Random Post:














