
మలయాళ బ్లాక్‌బస్టర్ ప్రేమలు తెలుగులోనూ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎస్ఎస్ కార్తికేయ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధతో ఈ సినిమా యూత్‌కు బాగా కనెక్ట్ అవ్వడంతో, మంచి వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా ద్వారా హీరోయిన్ మమిత బైజు తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. అందుకే, తెలుగులో ఆమెకు కొత్త అవకాశాలు వస్తున్నప్పటికీ, ఈ భామ ఎంతో జాగ్రత్తగా తన కెరీర్‌ను ప్లాన్ చేస్తోంది.
ఇప్పటికే విజయ్ నటిస్తున్న జన నాయగన్ చిత్రంలో మమిత ఒక కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. అయితే, ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఈ చిత్రం భగవంత్ కేసరి రీమేక్ అనే ప్రచారం ఉంది. ఇందులో మమిత పాత్ర, శ్రీలీల పాత్ర తరహాలో చాలా కీలకమైనదని చెన్నై వర్గాలు చెబుతున్నాయి. అలాగే, కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, మమిత ఇప్పుడు సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంలో లీడ్ రోల్‌కు ఎంపికైనట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుండగా, ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. సూర్య తన రీసెంట్ రెట్రో రీలీజ్ తర్వాత ఆర్జె బాలాజీతో 45వ సినిమాను పూర్తిచేసి, ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టనున్నట్లు టాక్. వెట్రిమారన్ వాడివాసల్ ఆలస్యమవుతుండటంతో, ముందుగా వెంకీ అట్లూరి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అంతకుముందు, ఈ సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసినా, కొన్ని కారణాల వల్ల మమిత బైజు ఫైనల్ అయినట్లు సమాచారం. ప్రేమలు తర్వాత మమిత తన కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేస్తోంది. అయితే, ఆమె జివి ప్రకాష్‌తో చేసిన రెబెల్ డిజాస్టర్ కావడంతో, ఈ కొత్త అవకాశం ఆమెకు చాలా కీలకమైనది. 2017లో ఇండస్ట్రీకి వచ్చినా, నిజమైన బ్రేక్ మాత్రం ఇప్పుడే వచ్చింది. అందుకే, ప్రతి ప్రాజెక్ట్‌ను ఆచితూచి ఎంచుకుంటోంది.
ఇప్పటికే సార్, లక్కీ భాస్కర్ వంటి వరుస బ్లాక్బస్టర్ల తర్వాత, వెంకీ అట్లూరి ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. వేసవిలో చిత్రీకరణ ప్రారంభించే అవకాశాలున్నాయని సమాచారం.
Recent Random Post:














