మరో పాన్ ఇండియా ఫిల్మ్ ఛాన్స్ కొట్టేసిన తమన్నా?

ఇండియన్ సినిమా స్క్రీన్ కి అందులోనూ ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాకి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని తార మిల్కీ బ్యూటీ తమన్నా. హీరోయిన్ గా పరిచయమై దశాబ్దం పూర్తయినా, ఇప్పటికీ కెరీర్లో తెలుగు, తమిళ్, హిందీలో ఆఫర్స్ తో బిజీ బిజీగా ఉంటోంది. అలాగే గ్లామర్ రోల్స్, పాత్రకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు, లేడీ ఓరియెంటెడ్, స్పెషల్ సాంగ్స్ మరియు ఇప్పుడు ఓటిటిలో, ఇలా ఎలాంటి ఛాన్స్ వచ్చినా తన సత్తా చాటుకున్న హీరోయిన్ తమన్నా.

బాహుబలి, ‘సైరా’ లాంటి పాన్ ఇండియా సినిమాల్లో నటించింది. అలాగే కెజిఎఫ్ లాంటి పాన్ ఇండియా ఫిల్మ్ లో ఓ స్పెషల్ సాంగ్ లోనూ కనిపించింది. తాజాగా మరో పాన్ ఇండియా ఫిల్మ్ ఆఫర్ తమన్నాని వరించిందని చెప్పాలి. అది కూడా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కావడం విశేషం. కెజిఎఫ్ స్టార్ యాష్ హీరోగా డైరెక్టర్ నర్తన్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా ఫిలిం రెడీ అవుతోంది. కెజిఎఫ్ 2 తర్వాత యాష్ ఆ చిత్రాన్ని ప్రారంభిస్తారు. ఆ సినిమా కోసం మొదటి ఛాయస్ గా తమన్నాని సెలక్ట్ చేసుకున్నారట.

తమన్నా కూడా చేయడానికి సముఖతగానే ఉన్నట్లు తెలుస్తోంది. అన్నీ ఓకే అయితే తమన్నా చేయబోయే మొట్టమొదటి కన్నడ సినిమా ఇదే అవుతుంది. ఇప్పటికే రెండు సార్లు స్పెషల్ సాంగ్స్ తో కన్నడ ప్రేక్షకులని అలరించిన తమన్నా ఇదివరకూ హీరోయిన్ గా ఒక్క సినిమా కూడా కన్నడలో చేయలేదు. ప్రస్తుతం తమన్నా తెలుగులో గోపీచంద్ ‘సీటీమార్’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.


Recent Random Post: