
బాలీవుడ్‌లో ఫిట్‌నెస్, ఫ్యాషన్కి సరిగ్గా అడ్రస్ ఇచ్చేది అంటే మలైకా అరోరానే. 50 ఏళ్ల వయసులోనూ, పాతికేళ్ల అమ్మాయిలకు పోటీనిచ్చే గ్లామర్ ఆమె సొంతం. యోగా, జిమ్, డైట్స్ అన్నీ పాటిస్తూ తన శరీరాన్ని పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయడం అందరికీ తెలిసిందే.
ఇప్పటివరకు సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్న మలైకా తాజా ఫొటోషూట్ లో ఆమె న్యూట్రల్ టోన్స్ థీమ్‌లో మతిపోగొడుతోంది. లేత గోధుమ రంగు స్ట్రాపీ బాడీకాన్ డ్రెస్‌లో తన ఫిగర్‌ను ఘాటుగా చూపిస్తూ, అదే రంగు బ్లేజర్‌ను భుజాలపై వేసుకుని బాస్ లేడీ వైన్స్ ఫోజ్ ఇచ్చింది.
“న్యూట్రల్ టోన్స్, స్ట్రాంగ్ ఎనర్జీ” అంటూ మలైకా పెట్టిన క్యాప్షన్ ఆమె ఆటిట్యూడ్‌ను చూపుతోంది. సింపుల్ గా కనిపిస్తూ కూడా పవర్‌ఫుల్ వజ్ క్రియేట్ చేయడం ఆమె ప్రత్యేకత. తన చూపులతోనే నెటిజన్లను ఆకట్టుకుంటూ, గ్లామర్ డోస్ తగ్గనట్లు మరోసారి నిరూపించింది.
నెటిజన్లలో చాలామంది “మలైకా వయసు 50 అని నమ్మలేం, 30లా కనిపిస్తోంది” అని కామెంట్ చేస్తున్నారు. ఈ లుక్‌లో వేలికి ధరించిన పెద్ద ఎమరాల్డ్ గ్రీన్ రింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే టాటూ స్పష్టంగా కనిపిస్తూ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. మినిమల్ మేకప్, లూజ్ హెయిర్‌తో ఆమె న్యాచురల్, క్లాసీగా మెరిసిపోతోంది.
వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా, కెరీర్, ఫ్యాషన్, గ్లామర్ పరంగా మలైకా ఎప్పుడూ టాప్‌లోనే ఉంటుంది. ‘చయ్య చయ్య’తో కుర్రాళ్ల గుండెల్లో చోటు సంపాదించిన ఈ సుందరి, ఇప్పటికీ అదే క్రేజ్ కొనసాగిస్తోంది. నెటిజన్లు ఆమె కొత్త ఫొటోలు చూసి “Age is just a number” అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Recent Random Post:














