
భాష ఏదైనా మల్టీ స్టారర్ సినిమాలకు ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది. ఒక్క హీరోనే స్క్రీన్‌పై కనిపించినా థియేటర్లలో హంగామా మామూలుగా ఉండదు, అలాంటిది ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే ఆ అంచనాలు మరింత పెరుగుతాయి. అందుకే అన్ని ఇండస్ట్రీల్లోనూ మల్టీ స్టారర్ చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు తమిళంలో సీనియర్ హీరోలు మాధవన్, సిద్దార్థ్ కలిసి నటించిన టెస్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నయనతార, మీరా జాస్మిన్ హీరోయిన్లుగా నటించడం విశేషం. అంతే కాకుండా క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామా, రిలీజ్‌కు ముందే హైప్ క్రియేట్ చేసింది.
ఎస్. శశికాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన టెస్ట్ ను మొదట థియేట్రికల్‌గా విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, కొన్ని కారణాల వల్ల నేరుగా ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ మల్టీ స్టారర్ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేస్తోంది. క్రికెట్ నేపథ్యంలో నడిచే కథ, భావోద్వేగాలతో కూడిన కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోందని రివ్యూలు చెబుతున్నాయి. ముఖ్యంగా క్రికెట్ ప్రియులకు ఈ సినిమా మంచి అనుభూతిని కలిగిస్తుందని చెబుతున్నారు. నయనతార నటించడంతో ఆమె ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
చెన్నైలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా ప్రభావితం చేసిందో ఆసక్తికర కథనం ద్వారా దర్శకుడు చూపించాడని ప్రశంసలు వస్తున్నాయి. మాధవన్, సిద్దార్థ్ వంటి టాలెంటెడ్ నటులతో పాటు లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో భాగం కావడం సినిమాకి అదనపు బలంగా మారింది. విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు ఉండటంతో, నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ప్రకటన తర్వాత మరింత హైప్ వచ్చింది.
వైనాట్ స్టూడియోస్ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్ నిర్మించిన ఈ చిత్రంలో నాజర్, కాళి వెంకట్, వినయ్ వర్మ కీలక పాత్రలు పోషించారు. సంగీతం శక్తి శ్రీ గోపాలన్ అందించగా, క్రికెట్ సన్నివేశాలను ఎంతో వాస్తవంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. గతంలో నయనతార నటించిన కొన్ని సినిమాలు కూడా డైరెక్ట్ ఓటీటీలో విడుదలై మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. ఆ ట్రెండ్ టెస్ట్ సినిమాకి కూడా కలిసి వస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి మీరు ఈ మల్టీ స్టారర్ స్పోర్ట్స్ డ్రామాను చూసారా? లేక చూడబోతున్నారా?
Recent Random Post:















