
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మాస్ జాతర సినిమా రిలీజ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
మొదట ఈ సినిమాను మే నెలలోనే రిలీజ్ చేయాలని భావించినా కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఆ తర్వాత మేకర్స్ ఇటీవల ఆగస్టు 27న వినాయక చవితి కానుకగా మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. ఈ వార్తతో రవితేజ అభిమానులు, సినీప్రియులు రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే మాస్ జాతరను ఖచ్చితంగా ఆగస్టు 27న రిలీజ్ చేస్తారా లేదా అనే డౌట్లు కొందరిలో ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాని నిర్మిస్తున్న అదే బ్యానర్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్ డమ్ మూవీ రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో స్పై జోనర్ లో తెరకెక్కిన కింగ్ డమ్ కూడా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కావడంతో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు జూలై 25 లేదా ఆగస్టు 1న రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు. అదే జరిగితే పర్లేదు. లేకపోతే మాస్ జాతరతో డేట్లు దగ్గరగానే రావాల్సి ఉంటుందంటూ టాక్ వినిపిస్తోంది.
ఇక ఆగస్టులో కింగ్ డమ్ ను రిలీజ్ చేయాలంటే ఆగస్టు 1నే ఎంచుకోవాలని మేకర్స్ అనుకుంటున్నారట. అది సాధ్యంకాకపోతే మాస్ జాతరను మళ్లీ వాయిదా వేయాలని నిర్మాత నాగవంశీ రవితేజతో చర్చించారట. అయితే రవితేజ మాత్రం డేట్ మార్చొద్దని, ఫిక్స్ చేసిన ఆగస్టు 27ననే రిలీజ్ చేయాలని చెప్పారట. ఎందుకంటే ఆయన ఇప్పటికే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాడు, అది వచ్చే సంక్రాంతికల్లా రిలీజ్ కావాల్సి ఉంది. దాంతో మాస్ జాతరను ఇక వాయిదా వేయొద్దని రవితేజ ఫిక్స్ అయ్యారు.
Recent Random Post:














