మీర్జాపూర్ బీనా ఆంటీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన మీర్జాపూర్ రెండు సీజన్ లకు అన్ని భాషల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఒక మంచి పొలిటికల్ కంటెంట్ ను అడల్ట్ కంటెంట్ తో బూతు డైలాగ్స్ తో మిర్జాపూర్ వెబ్ సిరీస్ లో చూపించారు. మొదటి సీజన్ కి సూపర్ హిట్ టాక్ రావడంతో రెండవ సీజన్ ను తీసుకు వచ్చారు.

2018 లో మొదటి సీజన్ రాగా.. రెండవ సీజన్ గత ఏడాది స్ట్రీమింగ్ అయింది. రెండవ సీజన్ లో కథను ముగించినట్లు గా చూపించారు. దాంతో సీజన్ 3 ఉండక పోవచ్చు అని అంతా అనుకున్నారు. కానీ తాజాగా రసికా దుగల్ అలియాస్ బీనా ఆంటీ మూడవ సీజన్ పై స్పష్టతనిచ్చింది. ఇప్పటికే మూడో మిర్జాపూర్ షూటింగ్ పూర్తి అయినట్లుగా ఆమె పేర్కొంది.

మిర్జాపూర్ లో మరీ బోల్డ్ కంటెంట్ లో నటించి విమర్శలు ఎదుర్కొన్న ఈమె మరో వైపు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. బోల్డ్ కంటెంట్ కి పెట్టింది పేరు అన్నట్లుగా నిలిచిన రసికా దుగల్ మూడవ సీజన్ లో కూడా ఏమాత్రం తగ్గకుండా బోల్డ్ సన్నివేశాల్లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

మిర్జాపూర్ సిరీస్ లో భర్తతో పడక సుఖం లేని బీనా ఆంటీ పనివాడి తో అక్రమ సంబంధం పెట్టుకున్న పాత్రలో కనిపించింది. అంతే కాకుండా వారసుడి కోసం మామతో కూడా శృంగారంలో పాల్గొన్న సన్నివేశాల్లో నటించడం ద్వారా ఆ పాత్ర చాలా ఫేమస్ అయింది. అందుకే మీర్జా పూర్ మళ్లీ వస్తుంది అనగానే రసికా దుగల్ పాత్ర గురించి చర్చ జరుగుతోంది.

తాజాగా మిర్జాపూర్ సీజన్ 3 డబ్బింగ్ ను ముగించినట్లు పేర్కొంది. ఇప్పటికే షూటింగ్ ముగిసిందని రసికా దుగల్ పేర్కొంది. అంతే కాకుండా మీర్జాపూర్ సీజన్ 3 స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. మొత్తానికి అన్ని భాషల బీనా ఆంటీ ఫ్యాన్స్ కి… మిర్జాపూర్ ఫ్యాన్స్ కి ఇది పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి.


Recent Random Post: