
తెలుగు ప్రేక్షకులకు ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓ సందర్భంలో టాలీవుడ్ సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, కొన్ని హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం తక్కువగా ఉండటంతో, అవకాశాలు తగ్గిన వెంటనే ఆమె మరింత దూరంగా మారిపోయారు.
కొన్ని సంవత్సరాల క్రితం బిగ్‌బాస్ షో ద్వారా ముమైత్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తరువాత కొంతకాలం బుల్లితెర, సినిమాలకు దూరంగా ఉన్న ఆమె, అనారోగ్య కారణాలతో వార్తల్లో నిలిచారు. ఆరోగ్య సమస్యల కారణంగా పూర్తిగా విశ్రాంతి తీసుకున్న ముమైత్ ఖాన్, ఇప్పుడు ఓ డాన్స్ రియాలిటీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తూ మళ్లీ బుల్లితెరపై తన పునరాగమనాన్ని కొనసాగిస్తోంది.
తాజా ఎపిసోడ్‌లో ముమైత్ చేసిన కామెంట్లు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. ఒక సందర్భంలో ఇంట్లో డాన్స్ చేస్తూ కాలు జారిపోవడంతో పడిపోయిన ఆమె, తొడలోని నరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. “ఆ సమయంలో బతకడం చాలా కష్టమని డాక్టర్లు చెప్పారు. 15 రోజుల పాటు కోమాలో ఉన్నాను. కోమా నుంచి బయటకి వచ్చాక సర్జరీ జరిగింది. ఆ సమయంలో కొంత మెమోరీ లాస్ కూడా జరిగింది. ఇప్పటికీ కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవడం చాలా కష్టం,” అని చెప్పారు.
ముమైత్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ సంతృప్తికరంగా లేదని, తలలో ఇప్పటికీ 9 వైర్లు ఉన్నాయని వెల్లడించారు. సాధారణంగా తెరపై నవ్వుతూ కనిపించే ఆమె వెనుక ఇంత బరువైన కథ ఉందని తెలుసుకుని అభిమానులు షాక్ అయ్యారు. షోలో ఆమె అనుభవాలు చెబుతుంటే సహజంగానే కంటతడి పెట్టినవారెందరో.
ఆపరేషన్ తర్వాత తన శరీరదారుఢ్యం, menthal health రెండూ దెబ్బతిన్నాయని, అందం కూడా తగ్గిందని ఆమె వేదన వ్యక్తం చేశారు. సినిమా రంగంలో మళ్లీ అడుగుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నా, అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం బుల్లితెరపై తన సత్తా చూపిస్తూ మళ్లీ ప్రేక్షకులను చేరువ అవుతున్నారు.
Recent Random Post:















