మృణాల్‌ ఠాకూర్‌కు బాలీవుడ్‌ బ్రేక్‌ ఇస్తుందా సన్నాఫ్‌ సర్దార్‌ 2?

Share


2022లో ‘సీతా రామం’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మంచి అవకాశాలను దక్కించుకుంది. కానీ బాలీవుడ్‌లో మాత్రం మృణాల్ ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది.

2014లో ‘హలో నందన్‌’ అనే మరాఠీ సినిమాతో సినీ రంగంలోకి వచ్చిన మృణాల్, ‘లవ్ సోనియా’ ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరుసగా హిందీ సినిమాలు చేసినా, ఆమె ఖాతాలో మాత్రం ఇంకా సరైన కమర్షియల్ హిట్ పడలేదు. తెలుగు ఇండస్ట్రీలోని స్టార్‌డమ్‌ను హిందీలో మాత్రం రిపీట్ చేయలేకపోయింది.

ప్రస్తుతం మృణాల్‌ చేతిలో నాలుగు హిందీ సినిమాలు ఉన్నాయి. అందులో ‘సన్నాఫ్ సర్దార్ 2’ కీలకం. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. గతంలో వచ్చిన ‘సన్నాఫ్ సర్దార్’ భారీ విజయాన్ని సాధించగా, ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్‌ కూడా అదే స్థాయిలో అంచనాలు పెంచుకుంది. ఇది రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ హిందీ రీమేక్‌ కాబట్టి, సీక్వెల్‌పై ఆసక్తి ఎక్కువైంది.

ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్‌ ‘రబీయా అక్తర్‌’ అనే కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ వీడియోల ప్రకారం ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది.

బాలీవుడ్‌లో ఇప్పటికీ పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న మృణాల్‌కు ఈ సినిమా సక్సెస్ వస్తే, ఆమె జోరు అక్కడ కూడా పెరుగుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమా విజయం సాధిస్తే, బాలీవుడ్‌లో మృణాల్ కెరీర్‌ మరో మలుపు తిరుగుతుందని అంటున్నారు.


Recent Random Post: