మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే చాలా మంది హీరోలు వచ్చారు. చిరంజీవి, పవన్ తర్వాత వచ్చిన వారిలో చరణ్, అల్లు అర్జున్ లు స్టార్ హీరోలు అయ్యారు. కొందరు మాత్రం ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా కూడా గుర్తింపు కోసం ప్రాకులాడుతున్నారు.
మెగా బ్రాండ్ ఇమేజ్, మెగా ఫ్యామిలీ హీరో అనే ట్యాగ్ తో ఈజీగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన హీరోలు ఆ తర్వాత ఫలితాలతో షాక్ అవుతున్నారు. మెగా ఫ్యామిలీ హీరో అవ్వడం వల్ల అవకాశాలు అయితే వస్తున్నాయి కానీ సక్సెస్ లు రావడం లేదని గ్రహించిన ఆ ఫ్యామిలీ హీరోలు స్లో అండ్ స్టీ అన్నట్లుగా సినిమాలు చేస్తున్నారు.
మంచి కథలను నమ్ముకోవాలి అనుకుని సినిమాలు చేస్తున్నారు. మెగా బ్రాండ్ ను నమ్ముకోవడం వల్ల సక్సెస్ లు రావని ఇప్పటికే వారికి అర్థం అయ్యింది. అందుకే సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఆరంభంలో బ్యాక్ టు బ్యాక్ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేశాడు కానీ ఇప్పుడు స్లో అయ్యాడు.
వైష్ణవ్ తేజ్ కూడా ఇప్పుడు వరుసగా సినిమాలు చేయడం లేదు. ఆది కేశవ ఫ్లాప్ తో చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఆయన వద్దకు చాలా మంది దర్శకులు వచ్చారు, వస్తూనే ఉన్నారట. కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఏ ఒక్క సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం అందుతోంది.
ఇక అల్లు శిరీష్ కూడా అంతే. ఆయన తలుచుకుంటూ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేయగలడు. కానీ హిట్ కొట్టాలి, మెగా బ్రాండ్ తో కాకుండా సొంత ఇమేజ్ తో హిట్ అవ్వాలని మెల్లగా సినిమాలు చేస్తున్నాడు.
ఇలా మెగా హీరోలు మెగా బ్రాండ్ ను పట్టించుకోకుండా సొంతంగా హిట్ కొట్టాలి, మంచి కథలు ఎంపిక చేసుకోవాలని ఎక్కువ గ్యాప్ తీసుకోవడం మంచి నిర్ణయం అన్నట్లుగా సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు వీరికి కచ్చితంగా మంచి విజయాలు దక్కుతాయి అనే నమ్మకం ను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.
Recent Random Post: