
టాలీవుడ్ నుంచి రాబోతున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా సినిమాల్లో ‘కన్నప్ప’ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. మంచు ఫ్యామిలీ ఎంతో గ్రాండ్‌గా రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 27న దేశవ్యాప్తంగా విడుదల కానుంది. భారీ బడ్జెట్‌తో – సుమారు రూ.200 కోట్లకుపైగా ఖర్చు పెట్టి తెరకెక్కించారు.
ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా కొచ్చిలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మలయాళ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, ఆయన సొంత రాష్ట్రమైన కేరళను ట్రైలర్ లాంచ్‌కు వేదికగా ఎంపిక చేయడం విశేషం.
ఈ ఈవెంట్లో మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు విశేషంగా నిలిచాయి. “మలయాళంలో ఆల్ టైం బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘తుడరుమ్’ చిత్రం కేవలం కేరళలోనే రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది. ‘కన్నప్ప’ ఒక్క రూపాయి అయినా దానిని మించాలి – ఇదే నా ఆకాంక్ష” అని చెప్పారు. భాషతో సంబంధం లేకుండా ‘కన్నప్ప’ కి మలయాళ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక మోహన్ లాల్ తన ప్రసంగంలో మోహన్ బాబును ప్రశంసలతో ముంచెత్తారు. “మోహన్ బాబు గారు sweetest person. ‘కన్నప్ప’ షూటింగ్ సమయంలో నన్ను ఎంతగానో కేర్ తీసుకున్నారు,” అని తెలిపారు. అంతేకాక, మోహన్ బాబు సినిమా కోసం తాను విలన్‌గా నటించాలని కోరిక తెలిపారు. దీనికి మోహన్ బాబు వెంటనే స్పందిస్తూ – “అలాగైతే నేనే మీ సినిమాలో విలన్ కావాలి” అన్నారు. వెంటనే మోహన్ లాల్ చమత్కారంగా – “అలా అయితే మొదటి సీన్లోనే గన్ తీసుకుని మిమ్మల్ని కాల్చేస్తా!” అని సరదాగా చెప్పారు. ఆ సన్నివేశం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది.
ఈ ఆసక్తికర సంభాషణలతో పాటు, ‘కన్నప్ప’ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఫ్యాన్స్‌కి ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్నారు.
Recent Random Post:















