
యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన మ్యాడ్ సినిమా బాక్సాఫీస్‌లో సూపర్ హిట్‌గా నిలిచిన కాబట్టి, మంచి కలెక్షన్లను కూడా సాధించింది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా, పెద్ద హైప్ లేకుండా రాగానే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ విజయానంతరం, మేకర్స్ ఈ సినిమాకు సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ను తీశారు.
మ్యాడ్ స్క్వేర్కు మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ, సినిమా కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించింది. ప్రత్యేకంగా, విష్ణు నటించిన ఓయి క్యారెక్టర్ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. మొత్తం కథ ఆ పాత్ర చుట్టూ తిరుగుతుంది. లడ్డూ మామ క్యారెక్టర్‌లో విష్ణు నటన ప్రేక్షకులని ఆకట్టుకుంది.
సినిమా క్లైమాక్స్‌లో, మ్యాడ్3 (మ్యాడ్ క్యూబ్) సీక్వెల్ రాబోతుందని మేకర్స్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. ఇటీవల, విష్ణు మిత్ర మండలి మూవీ ప్రోమోషన్స్ సందర్భంగా, మ్యాడ్3 గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ముందుగా, మ్యాడ్3 షూటింగ్ ప్రారంభమైందని, త్వరలో సోషల్ మీడియాలో ఫిల్మ్‌కు సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్స్ రానుందని చెప్పారు. మేకర్స్ సమ్మర్ 2026లో రిలీజ్ లక్ష్యంగా సినిమా పూర్తి చేయాలని యోచిస్తున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మ్యాడ్3ను మరింత ఎంటర్‌టైనింగ్‌గా రూపొందిస్తున్నారు.
మ్యాడ్ మరియు మ్యాడ్2ను నిర్మించిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థలో, నాగవంశీ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. అయితే, వార్2 సినిమాతో తన కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందని విమర్శలు ఎదుర్కొన్న వంశీ, మ్యాడ్3ను సైలెంట్‌గా సెట్స్‌పైకి తీసుకెళ్లారని వార్తలు వస్తున్నాయి.
Recent Random Post:















