
ఇప్పుడు టాలీవుడ్ యంగ్ హీరోలు ఒక క్లియర్ గేమ్ ప్లాన్‌తో ముందుకు సాగుతున్నారు. unnecessary హంగామాలకు దూరంగా, పూర్తిగా పనిచేసే మూడ్‌లోకి వెళ్లిపోయారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో ఎప్పుడూ కనిపించే వారు, ఇప్పుడు మాత్రం తమ సినిమాలపై ఫుల్ ఫోకస్ పెడుతూ షూటింగ్స్‌ను చక్కగా కంప్లీట్ చేస్తున్నారు.
విశ్వక్ సేన్, వరుణ్ తేజ్, సుధీర్ బాబు, ఆనంద్ దేవరకొండ, సిద్ధూ జొన్నలగడ్డ లాంటి యువ హీరోలే దీనికి ప్రూఫ్. విశ్వక్ సేన్ ప్రస్తుతం కేవీ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫంకీ మూవీ షూటింగ్ పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఎలాంటి హడావుడి లేకుండా మౌనంగా షూట్ పూర్తిచేసి, తరువాతే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలన్న ప్లాన్‌లో ఉన్నాడు.
వరుణ్ తేజ్ అయితే కొరియన్ హారర్ కామెడీ సినిమాతో వస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఇది పూర్తయిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటించి గ్రాండ్ ప్రమోషన్స్‌కి వెళ్లాలని చూస్తున్నారు.
సుధీర్ బాబు జటాధర అనే సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేశాడు. ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోంది. అవి పూర్తైన తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవుతాయని తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం ‘కే ర్యాంప్’ సినిమా పూర్తిచేశాడు. ఇప్పుడు ‘చెన్నై లవ్ స్టోరీ’పై ఫోకస్ పెట్టాడు. సైలెంట్‌గా షూట్ కంప్లీట్ చేసి తర్వాతే ప్రమోషన్‌కు సిద్ధమవుతున్నాడు.
ఆనంద్ దేవరకొండ కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఓ సినిమా చేస్తున్నాడు. కానీ ఎలాంటి హడావుడి లేకుండా పూర్తిగా షూటింగ్‌పైనే దృష్టి పెట్టాడు. అలాగే సిద్ధూ జొన్నలగడ్డ కూడా ‘తెలుసా కదా’ సినిమా విషయంలో ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు.
ఇలా ఇప్పుడు హంగామాలకు కాకుండా, కంటెంట్ మీద ఫోకస్ పెడుతున్న యువ హీరోలు… మంచి అవుట్‌పుట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ స్ట్రాటజీతో వారెంతవరకు హిట్స్ అందుకుంటారో… ఎదురు చూస్తూ ఉండాల్సిందే.
Recent Random Post:















