
ఏడుపదుల వయసులోనూ ఎనర్జిటిక్‌గా సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న రజినీకాంత్, ప్రస్తుతం ఓ సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను అనౌన్స్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు.
ప్రస్తుతం రజినీకాంత్ “కూలీ” సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ మూవీని ఆగస్టు 15న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక రీసెంట్‌గా “జైలర్ 2” మూవీ అనౌన్స్‌మెంట్ టీజర్ విడుదల కాగా, దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఒక్కసారిగా మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మేకర్స్ ఇచ్చిన ఎలివేషన్స్ ఫ్యాన్స్‌ను ఫిదా చేసేశాయి.
ఈ నేపథ్యంలో, రజినీకాంత్ కొత్త ప్రాజెక్ట్‌పై ఓ ఆసక్తికరమైన రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్, రజినీకి ఓ కథ వినిపించారని, అది సూపర్‌స్టార్‌కు నచ్చిందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా “జైలర్ 2” తర్వాత ప్రారంభం కానుందని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి.
అయితే, ఈ వార్తపై రజినీకాంత్ అభిమానుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. వెట్రిమారన్, పా. రంజిత్ వంటి దర్శకులు తమ రాజకీయ ప్రోపగాండాను సినిమాల్లో చూపించేలా ప్రయత్నిస్తారని, అలాంటి కథలు రజినీ ఇమేజ్‌కు నష్టమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన “కాలా”, “కబాలి” సినిమాలు ప్రేక్షకులను విభజించాయి.
అంతకుముందు మారి సెల్వరాజ్ దర్శకత్వంలో రజినీ ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వచ్చినా, ఇప్పుడు వెట్రిమారన్ ప్రాజెక్ట్ గురించి వార్తలు రావడం అభిమానుల్లో కొత్త చర్చకు దారితీసింది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే వేచి చూడాలి!
Recent Random Post:















