రజినీ–శివ కాంబో మళ్లీ రిపీట్? అభిమానుల్లో కలగొలుపు!

Share


సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “కూలీ” సినిమా ఇప్పటికే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్‌నే ఓ రేంజ్‌లో దూసుకుపోతుంది. ఐమాక్స్ స్క్రీన్లు లేకపోయినా, ప్రీమియర్ షోలు ఆలస్యంగా ఉన్నా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు. ప్రీ సేల్ బుకింగ్స్ పరంగా మంచి స్థిరమైన హైప్‌ను సృష్టించింది.

ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. అదే రోజున హృతిక్ రోషన్, ఎన్టీఆర్ జంటగా నటించిన “వార్ 2” కూడా రిలీజ్ అవుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న ట్రెండ్ చూస్తుంటే, “వార్ 2” కంటే “కూలీ”పైనే బజ్ ఎక్కువగా కనిపిస్తోంది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వం, స్టార్ కాస్టింగ్ అన్నీ కలవడం వల్ల ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రజినీకాంత్ ఇప్పటికే “కూలీ 2” షూటింగ్ పూర్తి చేయగా, ప్రస్తుతం “జైలర్ 2” షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలతో రజినీ బాక్సాఫీస్‌ ను మరోసారి షేక్ చేయబోతున్నారని టాక్.

అయితే “జైలర్ 2” తర్వాత రజినీకాంత్ కొత్తగా ఎవరితో సినిమా చేయబోతున్నారు అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముందుగా నితిలన్ సామినాథన్, హెచ్.వినోద్, వివేక్ ఆత్రేయ వంటి దర్శకుల పేర్లు వినిపించినా… ఇప్పుడు ‘సిరుత్తై’ శివ పేరు ముందుకు వస్తోంది.

ఇప్పటికే రజినీ-శివ కాంబినేషన్‌లో వచ్చిన “అన్నాత్తే” సినిమాకు తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో, ఈ కాంబినేషన్ పట్ల అభిమానులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. శివ దర్శకత్వం వహించిన తాజా చిత్రం “కంగువా” కోలీవుడ్‌లో డిజాస్టర్‌గా నిలిచింది. అయినా సరే, శివతో మరోసారి కలిసి సినిమా చేయాలన్న రజినీ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి నిర్మించనున్నట్టు సమాచారం. అయితే ఈ కాంబినేషన్‌కు ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి!


Recent Random Post: