బాలీవుడ్ నటి రవీనా టాండన్, ఆమె డ్రైవర్ పై దాడి చేసిన ఘటన సంచలనమైన సంగతి తెలిసిందే. నటి మాపై దాడి చేయకండని విజ్ఞప్తి చేసిన వీడియో ఒకటి వైరల్ అయింది. రవీనా..అమె డ్రైవర్ తాగి ఉన్నట్లుగా, ర్యాష్ డ్రైవింగ్ కి పాల్పడ్డారని కొందరు వారిపై ఫిర్యాదు చేస్తున్నట్లు గా కథనాలొచ్చాయి. తాజాగా ఈ ఘటనపై ముంబై పోలీసులు స్పష్టత ఇచ్చారు. అది తప్పుడు కేసు అని, ఎలాంటి మద్యం సేవించలేదని వెల్లడించారు.
`నటి, ఆమె డ్రైవర్ పై తప్పుడు కేసులు పెట్టారు. మేం సీసీ టీవీ పుటేజీ పరిశీలించాం. కారును పార్క్ చేసేందుకు డ్రైవర్ రివర్స్ చేస్తుండగా అదే సమయంలో ఓ కుటుంబం ఆ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తుంది. వారు కారుని ఆపి డ్రైవర్ తో గొడవ పడ్డారు. రివర్స్ చేస్తున్నప్పుడు వెనకాలా ఎవరైనా? ఉన్నారా? అని చూసుకోవాలంటూ వాగ్వా దానికి దిగారు. ఇది కాస్త తీవ్రంగా మారడంతో నటి అక్కడకు చేరుకున్నారు. వారి నుంచి డ్రైవర్ ని రక్షించేందుకు రవీనా ప్రయత్నం చేసారు.
ఆ తర్వాత రవీనా, ఆమెతో గొడవపడిన వ్యక్తులు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసారు` అని పోలీస్ లు వెల్లడించారు. శనివారం రాత్రి ముంబైలోని బాంద్రా కర్టర్ రోడ్డులో వెళ్తున్న ముగ్గురిని అదే మార్గంలో ప్రయాణిస్తోన్న రవీన కారు ఢృకొన్నట్లు ప్రచారం సాగింది. బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రశ్నించగా రవీనా డ్రైవర్ వారితో గొడవ పడినట్లు ఆరోపణలొచ్చాయి. దీంతో అక్కడున్న వారు ఎదురు తిరగగా, తమపై దాడి చేయోద్దని నటి కోరుతుందంటూ వీడియో వైరల్ అయింది.
రవీనా టాండన్ తాగి ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆమె పై కొందరు నెటి జనులు నిప్పుల వర్షం కురిపించారు. డబ్బు ఉంది అన్న అహంకారంతో ఇష్టారీతున వ్యవహరిస్తున్నారని రకరకాల కామెంట్లు వైరల్ అయ్యాయి. కానీ ఈ కేసులో రవీనా టాండన్ తప్పులేదని పోలీసుల విచారణలో తేలింది. దీంతో రవీనా టాండన్ పై మండిపడ్డ వారంతా ఆమెకి అదే సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెబుతున్నారు.
Recent Random Post: