రాజమౌళి–మహేష్ బాబు ‘వారణాసి’ సెట్ అప్ డిటైల్స్

Share


దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘వారణాసి’. టాలీవుడ్‌తో పాటు వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ దృష్టిని ఆకర్షిస్తూ, ప్రాజెక్ట్ పైన భారీ హైప్ నెలకొంది. ఇటీవల జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో విడుదలైన గ్లింప్స్‌కు అభిమానులు అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. రాజమౌళి మార్క్ విజువల్స్ మరియు మహేష్ బాబు పవర్‌ఫుల్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేశాయి.

అయితే, ఈ భారీ హైప్‌కి భిన్నంగా, వారణాసి సినిమా షూటింగ్ సైలెంట్‌గా, ఎలాంటి హడావుడి లేకుండా జరుగుతోంది. రాజమౌళి స్టైల్‌కి అనుగుణంగా, షూటింగ్ వివరాలు పూర్తిగా సీక్రెట్‌గా ఉంటున్నాయి.

ప్రస్తుతం సినిమా హైదరాబాద్‌లో కీలక షూటింగ్ షెడ్యూల్ కొనసాగుతోంది. దీనికి రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసి నగరాన్ని ప్రతిరూపం చేసేలా భారీ సెట్ నిర్మించారు. ఘాట్‌లు, ఆలయాలు, నదీ తీరాలు, పురాతన నగర శిల్పకళను అచ్చుగా రీక్రియేట్ చేశారు. నిజానికి, కాశీకి వెళ్లిన ఫీలింగ్ వచ్చేలా రాజమౌళి సెట్ డిజైన్ చేయించారు. ఈ సెట్ నిర్మాణానికి సుమారు 50 కోట్ల రూపాయల ఖర్చు అయ్యిందని సమాచారం. భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన సెట్‌లలో ఇదే ఒకటిగా నిలుస్తుందనే టాక్ ఉంది. ఈ సెట్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

తాజాగా జరుగుతున్న షెడ్యూల్‌లో మహేష్ బాబు పాల్గొంటున్నారు. ఆయనపై ఒక హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ను రాజమౌళి తెరకెక్కిస్తున్నారని సమాచారం. ప్రస్తుత షెడ్యూల్‌లో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా పాల్గొంటున్నారని తెలుస్తోంది. రాజమౌళి మార్క్ యాక్షన్ డిజైన్ మరియు గ్రాండియర్ విజువల్స్ ఈ సీన్స్‌ను మరింత స్థాయికి తీసుకెళ్తాయని టాక్ ఉంది.

సినిమాలో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా మరియు మాలీవుడ్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేఎల్ నారాయణ మరియు కార్తికేయ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా కీరవాణి సంగీతం అందిస్తోంది. భారీ తారాగణం, భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ‘వారణాసి’ పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుందనే సమాచారం విదితమే.


Recent Random Post: