రిషబ్ శెట్టి కొత్త ప్రాజెక్ట్‌పై ఆసక్తి పెరుగుతోంది

Share


కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కాంతార రెండు భాగాల అద్భుత విజయాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ స్టార్‌గా ఎదిగాడు. కాంతార చాప్టర్ వన్ 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం ద్వారా రిషబ్ స్టార్‌డమ్ ఎక్కడుందో స్పష్టంగా చూపించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రిషబ్ తదుపరి ప్రాజెక్ట్ ఏది అన్నదే సినీ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

ఇప్పటికే ఆయన తెలుగులో జై హనుమాన్ సీక్వెల్‌లో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి హనుమాన్ ఫ్రాంచైజ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రిషబ్ పాత్ర లుక్ పోస్టర్ కూడా విడుదలై మంచి హైప్ క్రియేట్ చేసింది. అదే సమయంలో బాలీవుడ్‌లో ఛత్రపతి శివాజీ బయోపిక్‌లోనూ రిషబ్ నటించనున్నాడు. ఈ చిత్రానికి సందీప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇటీవలే విడుదలైంది.

హనుమాన్ పాత్రలోనూ, శివాజీ పాత్రలోనూ రిషబ్ సరిగ్గా సూట్ అయ్యాడని అభిమానులు అంటున్నారు. ఈ రెండు చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ రెండు భారీ ప్రాజెక్టులలో రిషబ్ మొదటగా ఏదిని పట్టాలెక్కిస్తాడు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

కాంతార సినిమాకు తెలుగు ప్రేక్షకులు అందించిన మద్దతు రిషబ్ కెరీర్‌లో మలుపు తీసుకొచ్చింది. టాలీవుడ్‌లో పెద్ద అంచనాలు లేకుండా విడుదలైన ఆ చిత్రం ఇంత భారీ విజయాన్ని సాధించగలగడం తెలుగు ఆడియన్స్ వల్లేనని చెప్పవచ్చు. అదే ఆధారంగా ఆయనకు హిందీ మార్కెట్ కూడా తెరుచుకుంది.
తెలుగు ప్రేక్షకులు ఇంతగా అభిమానించిన నేపథ్యంలో రిషబ్ శెట్టి ముందుగా జై హనుమాన్ చిత్రాన్నే ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఛత్రపతి శివాజీ బయోపిక్ ముందుగా సెట్స్‌కి వెళ్తుందని అంచనా వేస్తున్నారు.

రెండు ప్రాజెక్టులు ఒకేసారి చేయడం మాత్రం సాధ్యంకాదని ఇండస్ట్రీ టాక్. ఇవి రెండూ సాధారణ చిత్రాలు కావు — భారీ సెట్‌లు, విస్తృతమైన ప్రీప్రొడక్షన్, మరియు పాత్రల కోసం రిషబ్ ప్రత్యేకంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. మేకప్‌కి కూడా గంటల సమయం పడుతుంది. ముంబై నుంచి హైదరాబాద్ వరకూ సమాంతరంగా షూట్ చేయడం అసాధ్యం.
ఇప్పుడు అందరి దృష్టి రిషబ్ శెట్టి మీదే — ఈ రెండు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ముందుగా ఏది సెట్స్‌పైకి వస్తుందో ఆయన ఎప్పుడు క్లారిటీ ఇస్తారన్నదే అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.


Recent Random Post: