రిషబ్ శెట్టి – హోంబలే ఫిల్మ్స్ మధ్య విభేదాలా? సోషల్ మీడియాలో చర్చలు

Share


కన్నడ సినీ పరిశ్రమలో నటుడు Rishab Shetty మరియు ప్రముఖ నిర్మాణ సంస్థ Hombale Films మధ్య విభేదాలపై వస్తున్న వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. Kantara వంటి బ్లాక్‌బస్టర్‌తో ఈ కాంబినేషన్‌కు పాన్ ఇండియా స్థాయిలో భారీ గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ద్వారా రిషబ్ శెట్టి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించగా, హోంబలే ఫిల్మ్స్ కూడా అగ్ర నిర్మాణ సంస్థగా మరింత క్రేజ్ పొందింది.

ఇలాంటి సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో ఇప్పుడు విభేదాలు వచ్చాయన్న ప్రచారం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల రిషబ్ శెట్టి తన సోషల్ మీడియా ఖాతాల్లో హోంబలే ఫిల్మ్స్ అధికారిక అకౌంట్లను అన్‌ఫాలో చేయడం ఈ వార్తలకు కారణమైంది. అంతేకాకుండా నటుడు Raj B. Shetty, హీరోయిన్ Rukmini Vasanthలను కూడా అన్‌ఫాలో చేయడం గమనార్హం.

దీంతో Kantara టీమ్‌తో ఆయనకు విభేదాలు ఉన్నాయనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే మరోవైపు హోంబలే ఫిల్మ్స్ అధినేత Vijay Kiragandurను మాత్రం రిషబ్ ఇంకా ఫాలో అవుతుండటం ఆసక్తికరంగా మారింది. ఇది నిజంగా విభేదాలేనా? లేక వ్యక్తిగత కారణాలా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటివరకు ఈ విషయంపై అటు రిషబ్ శెట్టి గానీ, ఇటు హోంబలే ఫిల్మ్స్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రిషబ్ అన్‌ఫాలో వెనుక కుటుంబ సంబంధిత కారణాలే ఉన్నాయనే రూమర్లు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా ఆయన భార్య ప్రగతి శెట్టి పేరు కూడా చర్చలోకి వచ్చింది.

Kantara ఫ్రాంచైజీలో భాగంగా రాబోయే తదుపరి చిత్రంలో ఆమెను కో-ప్రొడ్యూసర్‌గా చేర్చాలనే ఆలోచన ఉందని, అయితే దీనికి హోంబలే ఫిల్మ్స్ అంగీకరించలేదని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అభిప్రాయ భేదాలే ఈ పరిస్థితికి కారణమయ్యాయని అంటున్నారు.

అయితే ప్రస్తుతం ఇవన్నీ కేవలం రూమర్లే. అసలు నిజం ఏంటన్నది తెలియాలంటే సంబంధిత వ్యక్తులు అధికారికంగా స్పందించాల్సి ఉంది. Kantara సిరీస్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ వివాదం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తానికి, రిషబ్ శెట్టి – హోంబలే ఫిల్మ్స్ మధ్య విభేదాలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో రూమర్లు మరింత పెరుగుతున్నాయి. అభిమానులు ఇప్పుడు అధికారిక క్లారిటీ కోసం ఎదురుచూస్తున్నారు.


Recent Random Post: