ఏఆర్ రెహమాన్ కు దేశ వ్యాప్తంగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు ఉంది. ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న ఏఆర్ రెహమాన్ ఏం చేసినా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. ఆయన మ్యూజిక్ షో స్ దేశంలో ఎక్కడ పెట్టినా కూడా విపరీతమైన జనాలు హాజరు అవ్వడం జరుగుతుంది. ఆ విషయం మరోసారి నిరూపితం అయ్యింది.
పూణె లో రెహమాన్ టీమ్ మ్యూజిక్ కన్సెర్ట్ ను నిర్వహించడం జరిగింది. భారీ ఎత్తున అభిమానులు మరియు ప్రేక్షకులు రావడంతో రెహమాన్ టీమ్ ఉత్సాహంతో పోలీసులు ఇచ్చిన సమయం దాటిన తర్వాత కంటిన్యూ చేస్తూ వచ్చారు. దాదాపు పదిహేను నిమిషాలు చూసిన తర్వాత ఇక చేసేది లేక పోలీసులు రంగ ప్రవేశం చేశారట.
స్టేజ్ పై రెహమాన్ మరియు ఆయన టీమ్ పాటలు పాడుతున్న సమయంలో పోలీసులు పైకి ఎక్కి ఆపి వేయాలని కోరారట. దాంతో వెంటనే రెహమాన్ టీమ్ కాన్సెర్ట్ ను ఆపేసి స్టేజ్ దిగి పోయారు. ప్రేక్షకులు కూడా మెల్ల మెల్లగా అక్కడ నుండి వెళ్లి పోయారు. రెహమాన్ పాడుతున్న సమయంలో పోలీసులు అడ్డుకోవడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పూణె లో జరిగిన మ్యూజిక్ కన్సెర్ట్ కు మంచి స్పందన వచ్చిందని.. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అంటూ రెహమాన్ ట్వీట్ లో పేర్కొన్నాడు. పోలీసులు మధ్యలో రాకుండా ఉంటే మరో అర్థ గంట వరకు షో ఉండేది అంటూ రెహమాన్ శిష్యులు చెబుతున్నారు.
Recent Random Post: