రోడ్డు ప్రమాదంలో నోరా ఫతేహికి స్వల్ప గాయాలు

Share


బాలీవుడ్ నటి నోరా ఫతేహి రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు. ముంబై పశ్చిమ అంబోలీ లింక్ రోడ్డుపై నిన్న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సన్‌బర్న్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో ప్రదర్శన కోసం వెళ్తున్న సమయంలో, మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు ఆమె ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాదానికి కారణమైన వ్యక్తిని 27 ఏళ్ల వినయ్ సక్పాల్‌గా గుర్తించారు. అతడు మద్యం సేవించి వాహనం నడిపినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై పోలీసులు అతడిని అరెస్ట్ చేసి, రాష్ డ్రైవింగ్ మరియు డ్రంక్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.

ప్రమాదం అనంతరం నోరా ఫతేహిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ఆమెకు స్వల్ప గాయాలు, వాపు, తేలికపాటి కన్‌కషన్ ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.

ఈ ఘటనపై నోరా ఫతేహి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ప్రమాద సమయంలో సీటు నుంచి పక్కకు పడిపోయి కిటికీకి తల తగిలిందని తెలిపారు. ఈ అనుభవం చాలా భయానకంగా ఉందని పేర్కొంటూ, ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని అభిమానులకు భరోసా ఇచ్చారు. అలాగే మద్యం సేవించి వాహనం నడపవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


Recent Random Post: