రోషన్ మేకా నెక్స్ట్ ఫేజ్: సితారలో రొమాంటిక్ కామెడీ, గీతా ఆర్ట్స్‌లో మరో సినిమా

Share

చిన్నపిల్లాడిగా ‘రుద్రమదేవి’, టీనేజీలో ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రాల్లో కనిపించిన నటుడు రోషన్ మేకా, ‘పెళ్లిసందడి’తో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న రోషన్, తాజాగా ‘ఛాంపియన్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కమర్షియల్‌గా పెద్ద హిట్ రాకపోయినా, రోషన్ లుక్స్ మరియు నటనకు మంచి స్పందన లభించింది.

‘ఛాంపియన్’ చిత్రాన్ని స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించడంతో, రోషన్ కెరీర్‌పై ఇండస్ట్రీలో ఆసక్తి పెరిగింది. ఇదే క్రమంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, గీతా ఆర్ట్స్ వంటి టాప్ బ్యానర్లు అతడితో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నాయి.

ముందుగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో హిట్ ఫ్రాంచైజీల దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో రోషన్ నటించనున్నాడు. ఈ సినిమా సంక్రాంతి తర్వాత ప్రారంభమై, మూడు నుంచి నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి త్వరగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నట్లు రోషన్ వెల్లడించాడు. ఇప్పటివరకు సీరియస్ థ్రిల్లర్స్‌తో పేరు తెచ్చుకున్న శైలేష్, ఈసారి రోషన్‌తో రొమాంటిక్ కామెడీ తెరకెక్కించనున్నాడని చెప్పాడు.

శైలేష్ వ్యక్తిగతంగా చాలా ఫన్నీ మనిషి అని, కామెడీ రాయడంలో అతడి స్ట్రెంత్ చాలా గొప్పదని రోషన్ పేర్కొన్నాడు. మరోవైపు గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రోషన్ చేయబోయే సినిమాకు దర్శకుడు ఇంకా ఖరారు కాలేదు. అలాగే తమిళ లెజెండరీ దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా రోషన్‌తో ఓ సినిమా చేయాలనుకుంటున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ కొత్త ప్రాజెక్టులతో రోషన్ మేకా కెరీర్ కొత్త దశలోకి అడుగుపెడుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి.


Recent Random Post: