రౌడీ స్టార్ ఎట్టి పరిస్థితుల్లో ఆ ఛాన్స్ వదులుకోడు

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. గత చిత్రం లైగర్ ఇచ్చిన షాక్ నుండి విజయ్ దేవరకొండ తేరుకోవాలంటే కచ్చితంగా ఖుషి సినిమా సక్సెస్ అవ్వాల్సిందే. మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుడు శివ నిర్వాన దర్శకత్వంలో ఖుషి సినిమా రూపొందుతున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి.

ఖుషి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ చేయబోతున్న సినిమాలు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాయి. పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న రౌడీ స్టార్ మరో వైపు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేయబోతున్నాడు. ఈ మూడు సినిమాలు కాకుండా సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాను కూడా విజయ్ దేవరకొండ చేయాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ.. సుకుమార్ కాంబో మూవీ అధికారిక ప్రకటన వచ్చి సంవత్సరాలు గడుస్తుంది. అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి అప్ డేట్ లేదు. పుష్ప సినిమా కోసం ఎక్కువ సమయంను సుకుమార్ తీసుకుంటున్న కారణంగా విజయ్ దేవరకొండ హీరోగా ఆయన సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడం అనేది విజయ్ దేవరకొండకు చాలా ముఖ్యం.. పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ గా మారిన సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయడం వల్ల విజయ్ దేవరకొండకు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు లభించే అవకాశం ఉంది.

కనుక సుకుమార్ తో సినిమా ను చేసే అవకాశం ను ఎట్టి పరిస్థితుల్లో వదిలేయవద్దని విజయ్ దేవరకొండ అభిమానులు కోరుకుంటున్నారు. రౌడీ స్టార్ కూడా సుకుమార్ ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది వీరిద్దరి కాంబో సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి.


Recent Random Post: